పశ్చిమగోదావరి జిల్లా డెల్టాలో ఆక్వా రాజధానిగా గుర్తింపు పొందింది భీమవరం.. తెలుగు రాష్ట్రాల్లోనూ క్షత్రియ కమ్యూనిటీకి కీలక ప్రాంతంగా భీమవరానికి పేరుంది. ఆక్వా ఉత్పత్తులలో అగ్రస్థానానికి ఎదిగింది ఈ పట్టణం.. నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం రూరల్, వీరవాసరం మండలాలున్నాయి. 2009 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు నియోజకవర్గంలో పూర్తిగా రాజుల ఆధిపత్యమే ఎక్కువగా ఉండేది. పునర్విభజన తర్వాత భీమవరం నియోజకవర్గంలో అప్పటి వరకు ఉన్న పాలకోడేరు మండలాన్ని ఉండి నియోజకవర్గంలో కలిపి పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న వీరవాసరం మండలాన్ని భీమవరం నియోజకవర్గంలో చేర్చడంతో కాపుల హవా ప్రారంభమైంది. వీరవాసరం మండలంలో కాపు జనాభా, కాపు ఓటర్లు ఎక్కువగా ఉండడంతో భీమవరం నియోజకవర్గం గెలుపు, ఓటమిలు, అభ్యర్థులు ఎంపికలో ఇప్పుడు రాజులతోపాటు కాపు ఓట్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి.
2004లో ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి గ్రంధి శ్రీనివాస్ కాంగ్రెస్ తరపున గెలిచారు. మరోవైపు భీమవరంలో క్షత్రియ వర్సెస్ కాపు రాజకీయ సంగ్రామం నడుస్తుంది. నియోజకవర్గంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధి చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే అంజిబాబు అభివృద్ధిపై పెద్దగా దృష్టి పెట్టినట్టు కనిపించదు.. సౌమ్యుడు, వివాద రహితుడు అన్న పేరు మాత్రమే ఉన్నా ప్రజలతో మమేకమైంది కూడా తక్కువే.. వాస్తవంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గత ఐదేళ్లలోనే ఆయన నియోజకవర్గాన్ని పెద్దగా అభివృద్ధి చేసింది లేదు. గత ఎన్నికలకు ముందే అంజిబాబు ఓడిపోతారని అందరూ అనుకున్నా అనూహ్యంగా ఆయన చివరి క్షణంలో టీడీపీలోకి జంప్ చేసి జిల్లాలో టీడీపీ వేవ్ లో గెలిచారు. రెండోసారి గెలిచిన అంజిబాబు అవినీతి, అక్రమాలలోనూ కాలు పెట్టారట.. ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలతో అంజిబాబుకు ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదనే అంటున్నారు.
అంజిబాబు వియ్యంకుడు మంత్రి గంటా శ్రీనివసరావు కావడంతో ఆ సపోర్ట్ కూడా ఉంది.. అయితే ఇప్పుడు గంటాకు ఎక్కడా టికెట్ కేటాయించకపోవడంతో అంజిబాబుకు ఇబ్బంది కనిపిస్తోంది. గతంలో పాదయాత్రకు వచ్చిన జగన్ సైతం భీమవరం నుంచి వచ్చే ఎన్నికల్లో గ్రంధి శ్రీనివాస్ పోటీ చేస్తారని బహిరంగంగా అప్పుడే ప్రకటించడంతో గ్రంధి గ్రౌండ్ వర్క్ తో పాటు తనతోపాటు పదేళ్లనుంచీ కాపాడుకుంటున్న క్యాడర్ ను బూస్టప్ చేసేసారు. అంజిబాబుతో పోలిస్తే గ్రంధి దూకుడుగా ఉంటారన్న పేరు ఉంది. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు కూడా ఆయనకు ప్లస్ కానున్నాయి. అయితే ఈ ప్రధాన సామాజికవర్గంతో ఆయనకు ఉన్న తీవ్రమైన వైరుధ్యం నేపథ్యంతో పాటు జనసేన పార్టీ గ్రంధి గెలుపు, ఓటమిలను శాశించే పరిస్థితి ఏర్పడింది. అందుకే తెలివిగా గ్రంధి కూడా నాలుగేళ్లుగా ప్రతీ ఒక్కరినీ కలుపుకుని వెళ్తున్నారు.
ఇక్కడ క్షత్రియులు కూడా గ్రంధికి జైకొట్టేందుకు సిద్ధమయ్యారు. ఇక నియోజకవర్గంలో పవన్ అభిమానులు, కాపు సామాజికవర్గం బలంగా ఉన్న జనసేన పోటీలో లేకపోవడంతో సామాజికవర్గ పరంగా వారంతా గ్రంధికే మద్దతిచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా టీడీపీ పట్టణాధ్యక్షుడు తోట భోగయ్య వంటి నాయకులు సైతం గ్రంధికే మద్దతిస్తున్నారు. పాత టీడీపీ క్యాడర్ ఇప్పటికే గ్రంధి వర్గంలో చేరిపోయింది. చంద్రబాబు అబద్ధపు హామీలు, రాష్ట్రవ్యాప్తంగా వ్యతిరేకతతో పాటు జగన్ హవాతో భీమవరంలో గ్రంధి గెలుపు పక్కా అయినా మెజారిటీ భారీగా రానుందనే అంచనాలు వెలువడనున్నాయి.