ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి రాజుకుంది.ఇప్పటికే జగన్ ఒకేసారి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇక టీడీపీ కూడా నిన్న అర్ధరాత్రి 1గంట తరువాత మిగిలిన అభ్యర్ధులను ప్రకటించింది. అయితే వైసీపీ దెబ్బకు చంద్రబాబుకు టికెట్ కేటాయించడంలో ముచ్చెమటలు పట్టాయని తెలుస్తుంది.టీడీపీలో టికెట్లు కేటాయించినప్పటికీ కొంతమంది వైసీపీలో చేరగా కొందరు మేము పోటీ చేయమని చేతులెతేస్తున్నారు.2014 చంద్రబాబు గెలవడానికి గల కారణం పొత్తు పెట్టుకోవడమే అని అందరికి తెలుసు.అటు బీజీపీ ఇటు పవన్ కళ్యాణ్ అండతో గెలిచింది.
నాలుగేళ్ళు వాళ్ళతో కాపురం చేసిన బాబు ఇప్పుడు రివర్స్ అయ్యారు.ఇప్పుడు కూడా సోలోగా పోటీ చేసే సత్తా లేదని తెలుస్తుంది.అందుకే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఉన్న పరువు పోగొట్టుకున్నారు.అయితే ఇప్పుడు ఏపీలో కూడా అదే పరిస్థితి తను సిద్ధం చేసిన లిస్టు మొత్తం సోనియాకు బాబు పంపారట.ప్రస్తుతం రాహుల్ తమ పార్టీ వాళ్లైన కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి,కిశోరే చంద్రదేవ్, పనబాక లక్ష్మి లకు టీడీపీలో టికెట్లు ఇవ్వమని చెప్పగా వాళ్ళకే ఎంపీ టికెట్లు ఇచ్చారు.