ఎన్నికల సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది.ఇప్పటికే కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.మరికొంద్దరైతే ఈసారి ఎన్నికల్లో పోటీ చెయ్యమని చెబుతున్నారు.నటుడు మరియు టీడీపీ ఎంపీ మురళీ మోహన్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఆయన ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నట్లు ముందుగానే ప్రకటించారు.తాజాగా మురళీ మోహన్ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంసంగా మారాయి.
ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు ఏపీలో సంచలనం రేపుతున్నాయి.ఇంతకు ఇందులో జగన్ కు మద్దతుగా మాట్లాడారు.ఇటీవల తెలుగు ఇండస్ట్రీ నుండి చాలా మంది సినీ ప్రముఖులు కింగ్ నాగర్జున, మాజీ ఎమ్మెల్యే జయసుధ,కమెడియన్ అలీ, పృథ్వీ, పూరీ జగన్నాథ్ ,తాజాగా నటుడు రాజా రవీంద్ర, నిర్మాత పీవీపీ వంటి వారు వైసీపీలో చేరిన విషయం అందరికి తెలిసిందే.సినిమా వాళ్లు అందరు వైసీపీలో చేరడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.అసలు ఇండస్ట్రీ వాళ్ళు జగన్ ని కలవడం ఏమిటని,తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వాళ్ళపై వత్తిడి చేసిమరీ బలవంతంగా వైసీపీలోకి పంపారని మీడియా ముందు చెప్పారు.
దీనిపై స్పందించిన మురళీమోహన్ చంద్రబాబుకు ధీటుగా సమాధానం ఇచ్చారు.సినిమా వాళ్ళు ఎవరికిబడితే వాళ్ళకి భయపడే పిరికి వాళ్లు కాదని,వాళ్ళని చులకనగా చూడొద్దని మండిపడ్డారు.ఎవరికి నచ్చిన పార్టీకి వారు వెళ్తున్నారు తప్ప బలవంతంగా వెళ్ళడం లేదని జగన్‌కు మద్దతుగా మాట్లాడి బాబుకు ఝలక్ ఇచ్చారు.