Home / 18+ / అశోక్‌కు చుక్కెదురు…వాదనలను కొట్టిపారేసిన హైకోర్టు

అశోక్‌కు చుక్కెదురు…వాదనలను కొట్టిపారేసిన హైకోర్టు

డేటా చోరి..ప్రస్తుతం ఇప్పుడు అందరి నోటా ఇదే వినిపిస్తుంది.ఈ వ్యవహారంలో తప్పించుకు తిరుగుతున్న ఐట్రి గ్రిడ్స్‌ సంస్థ సీఈవో అశోక్‌కు హైదరాబాద్‌ హైకోర్టులో చుక్కెదురైంది.అశోక్‌ తెలంగాణ పోలీసులు తనపై అక్రమ కేసులను పెట్టారని, వాటిని కొట్టేయాలని హైదరాబాద్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ను దాఖలు చేసిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై విచారించిన న్యాయస్థానం..పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ తప్పనిసరిగా ఇవ్వాలని ఆదేశిస్తూ షాక్‌ ఇచ్చింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.ఇది ఇలా ఉండగా అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ్ లోత్ర వాదనలు వినిపిస్తూ ఈ కేసు తెలంగాణ పరిధిలోకి రాదని, ఏపీకి బదిలీ చేయాలని కోరారు.అయితే అతని వాదనతో న్యాయస్థానం ఏకీభవించలేదు.

ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్‌ 2, 3 రోజుల్లో బయటకు వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించడమే ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. ఒక్కప్పుడు ఓటుకు కోట్లు కేసులో నిందితుడైన మత్తయ్య ఏపీకి పరారవడం,ఏకంగా తెలంగాణ సీఎంపైనే పోలీసులకు కంప్లైంట్ తెలిసిందే. అప్పుడు మత్తయ్యను ఏపీ పోలీసులు సపోర్ట్ చేయగా ఇప్పుడు కూడా అలానే జరుగుతుంది.తెలిసిన సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏపీ పోలీసుల సంరక్షణలోనే అశోక్‌ ఉన్నట్లు తెలుస్తుంది.దీనిబట్టే అర్ధమవుతుంది ఏ తరహాలో అశోక్ ని కాపాడుతున్నారని.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat