వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామయ్య నార్నే శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక పదవి ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని ఆదివారంనాడు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే దగ్గుబాటి హితేష్ వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే.
ఫిబ్రవరి 28న నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో చేరిన సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా మా నాయకుడు జగన్ ని గెలిపించుకుంటామని అన్నారు. ఇప్పటివరకు చంద్రబాబు ఏపీని భ్రస్టు పెట్టించారని.మన రాష్ట్రానికి జగన్ వస్తేనే మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.పెద్దాయన హయాంలో తాను ఆ కుటుంబానికి మద్దతుదారుడిగా ఉన్నానని గుర్తుచేసుకున్నారు.