Home / Uncategorized / లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎంఈఐఎల్‌

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎంఈఐఎల్‌

హైదరాబాద్, మార్చి 11: దేశంలోనే అత్యంత వేగంగా విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని పూర్తి చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌,
ఏషియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లలో ఎంఈఐఎల్ చోటు సంపాదించుకుంది . కేవలం ఏడు నెలల కాల వ్యవధిలోనే 400 /200
కెవి సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ఎంఈఐఎల్ పూర్తిచేసింది. 2015 సెప్టెంబర్ 25న సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని మొదలుపెట్టి 2016
ఏప్రిల్ 26న ప్రారంభోత్సవానికి సిద్ధం చేసింది. అదే రోజున పవర్ గ్రిడ్ కార్పొరేషన్ సబ్ స్టేషన్‌ను ప్రారంభించింది. ఎంఈఐఎల్
సామర్థ్యానికి గుర్తింపుగా పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ కూడా బెస్ట్‌ డెబ్యూటంట్‌ అవార్డుతో సత్కరించింది. గతంలో పట్టిసీమ
ఎత్తిపోతల పథకాన్ని గడువుకన్నా ముందే నిర్మించటం ద్వారా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌ లోకి ఎంఈఐఎల్‌ ఎక్కిన
విషయం తెలిసిందే.
అనంతపురం జిల్లా నంబూలపూలకుంట (ఎన్‌పీ కుంట) వద్ద క్లిష్టమైన నమూనాలు, కఠినమైన నిబంధనలు, ఏమాత్రం
అనుకూలంగాలేని పరిస్థితులు, నిత్యం వర్షాలు నేపధ్యంలో కూడా నిర్ణీత గడువుకన్నా ముందే ఈ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని
పూర్తిచేసింది మేఘా ఇంజనీరింగ్. కేంద్ర ప్రభుత్వ నవరత్న సంస్థల్లో ఒకటైన పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా
(పిజీసీఐ) ఎన్‌పీ కుంట వద్ద 400/200 కెవి సబ్ స్టేషన్ నిర్మించాలని తలపెట్టింది. దీని ద్వారా అక్కడే పవర్ గ్రిడ్ ఏర్పాటు
చేస్తోన్న ఆల్ట్రా మెగా సోలార్ పార్క్ గ్రిడ్‌కు అనుసంధానించాలనేది లక్ష్యం. ఆ లక్ష్యాన్ని మేఘా ఇంజనీరింగ్ గడువుకన్నా
ముందే నిర్మాణాన్ని పూర్తి చేసి అప్పగించింది. పవర్ గ్రిడ్ 1500 మెగావాట్ల విద్యుత్‌ను గత రెండు సంవత్సరాలుగా
నిరంతరాయంగా సరఫరా చేస్తోంది. ”సాధారణంగా ఇటువంటి సబ్ స్టేషన్ నిర్మాణానికి 15 నుంచి 18 నెలల సమయం
పడుతుంది. తమకు సాధ్యమైనంత త్వరగా ఈ సబ్ స్టేషన్ నిర్మించి ఇవ్వాలని ఎంఈఐఎల్‌ను పవర్ గ్రిడ్ కోరింది.
సవాళ్లను స్వీకరించి వాటిని సకాలంలో పూర్తి చేయడానికి అదనపు వనరులను, యంత్రాలను సమీకరించాం. మా
ఇంజినీర్లు, సిబ్బంది 24 గంటలూ మూడు షిఫ్టుల్లో పనిచేసి ప్రాజెక్టును అతివేగంగా పూర్తి చేయగలిగాం. ఫలితంగా
దేశంలోనే తక్కువ సమయంలో ఏర్పాటు చేసిన సబ్ స్టేషన్ గా లిమ్కా రికార్డ్ దక్కింది. ఇది నిజంగా గర్వపడే సందర్భం”
అని ఎంఈఐఎల్ డైరెక్టర్ బి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా సబ్‌స్టేషన్ పనితీరు సంతృప్తికరంగా ఉందని పవర్‌గ్రిడ్‌ కార్పోరేషన్‌ ధృవీకరించటంతో
పాటు తన అధికారిక వెబ్‌సైట్‌లో ఈ విషయాన్ని పొందు పరిచింది. సబ్ స్టేషన్ నిర్మాణంలో భాగంగా ఎన్‌పీ కుంటలో
ఎంఈఐఎల్ 500ఎంవీఏ, 400/220 కేవీ సామర్థ్యం కలిగిన మూడు ఆటో ట్రాన్స్ఫార్మర్లు, 125 ఎంవీఏఆర్ బస్ రియార్టర్
ఒకటి నిర్మించింది. 400 కేవీ 100 ఎవీఏఆర్ స్టేషన్ ఒకటి. 400 కేవీ బేస్లైన్లు రెండు, 400 కేవీ టైబేస్‌లు నాలుగు, 220 కేవీ
లైన్ బేస్‌లు నాలుగు, 220 కేవీ బస్ కాపులర్‌ బే ఒకటి, 220 కేవీ ట్రాన్స్ఫార్మర్ బస్‌ కాపులర్ బే ఒకటి, 220కేవీ, 500
ఏంవీఏ, ఆటోట్రాన్స్ఫార్మర్ బే లను మూడింటిని ఏర్పాటు చేసింది. సివిల్ పనులైన అంతర్గత డ్రైన్లు, రహదారాలు,
కల్వర్టులు, కంట్రోల్‌రూమ్, బే క్యూస్క్, ట్రాన్సిట్ క్యాంపు, ఫైర్ఫైటింగ్ పంప్‌హౌజ్‌ నిర్మాణాలను అదే సమయంలో పూర్తి
చేసింది. “పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ 18 నుంచి 20 నెలల్లో పూర్తి చేయాలని గడువును విధించింది. తొలుత ప్రాజెక్టు డిజైనింగ్‌
నుంచి ప్రాజెక్టు టెస్టింగ్‌ వరకు కనీసం 18 నెలల పడుతుందని అనుకున్నాం. కానీ అంతకన్నా త్వరగా పూర్తి చేసేందుకు
ఎంఈఐఎల్‌ తనకు తాను గడువును విధించుకుని రికార్డు సమయంలో సబ్‌స్టేషన్‌ను నిర్మాణాన్ని పూర్తి చేసి అరుదైన
రికార్డును సొంత చేసుకున్నాం” అని శ్రీనివాస్‌ రెడ్డి వివరించారు.
ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం పూర్తిగా రాళ్లు రప్పలతో ఏ మాత్రం అనువుగా లేదు. వాటిని తొలగించడానికి అత్యాధునిక బ్లాస్టింగ్‌
టెక్నాలజీని ఎంఈఐఎల్‌ ఉపయోగించింది. 2015*16 మధ్య కాలంలో అనూహ్యంగా వర్షాలు కూడా అధికంగా కురవడంతో
ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవాంతరాలు ఎదురయ్యాయి. పట్టుదల, కచ్చితమైన ప్రణాళికలతో సవాళ్లను అధిగమించి
ఎంఈఐఎల్‌ గడువుకన్నా 5 నెలలు ముందుగానే పూర్తి చేసింది. ఎంఈఐఎల్‌ పనితీరును పవర్‌ గ్రిడ్‌ కార్పోరేషన్‌
అభినందించింది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat