తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి సొంత నియోజకవర్గంలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.భారీ సంఖ్యలో టీడీపీకి చెందిన కొందరు ముఖ్య నేతలు,కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.శుక్రవారం అధినేత జగన్ సమక్షంలో టీడీపీ నేతను వైఎస్సార్సీపీలో చేరడంతో వారికి జగన్.. కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
మరోపక్క చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నేత బులెట్ సురేష్, టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మాపక్షి మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ భాస్కర్, టీడీపీ కార్పొరేటర్లు నవీన ఇందు, శ్రీకాంత్, సహదేవన్, చంద్రయ్య, డేవిడ్, ముత్తయ్య, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వేలంగాని, ఎంపీటీసీ రాధమ్మ, ఇండిపెండెంట్ కార్పొరేటర్ లతా శ్రీధర్ తదితరులు మాజీ ఎంపీ మిథున్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.సొంత నియోజకవర్గ ప్రజలకే బాబుపై నమ్మకం లేకుంటే ఇంక రాష్ట్రమంతట జనాలు ఎలా నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇది ఇలా ఉండగా ఇటు మంగళగిరికి చెందిన కౌన్సిలర్ ఉడత శ్రీను, మునగపాటి వెంకటేశ్వరరావు, వంగర శంకుతల, బి.నరసింహారావు, షేక్ అక్రమ్, ఎం.బాబురావు, డీ.శ్రీనివాస్, కె.లక్ష్మణ్ రావు తదితరులు శుక్రవారం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.