Home / 18+ / చంద్రశేఖర్ ఆజాద్.. ఎలా చనిపోయారో.. దేశం కోసం ఎలా పోరాడారో చూడండి

చంద్రశేఖర్ ఆజాద్.. ఎలా చనిపోయారో.. దేశం కోసం ఎలా పోరాడారో చూడండి

కొందరు పెద్దమనుషుల పెద్దరికాన్ని కాపాడటానికి అందరికీ తెలియాల్సిన కొన్ని నిజాలను ఉద్దేశ్యపూర్వకంగా చరిత్రలో సమాధి చేసి పాఠ్య పుస్తకాల్లో వారిని గొప్పగా చూపిస్తూ హీరోలుగా మార్చారనీ, నిజమైన దేశభక్తులకు ఒరిగిందేమీలేదనీ, వారు అజ్నాతంలో మిగిలిపోయారనే విషయాన్ని మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ అలాంటివారిలో ఒకడైన చంద్రశేఖర్ ఆజాద్ గురించి ప్రస్ధావించుకోవాల్సిన రోజు ఈ పిబ్రవరి 27.

ఆజాద్..
15 ఏళ్ళ ప్రాయంలో స్వాతంత్రోద్యమంలో ప్రవేశించి యువతలో దేశభక్తిని రగిలించి, చైతన్యవంతుల్ని చేసిన దేశం గర్వించదగ్గ స్వాతంత్ర్య సమరయోధుడు, తన మిత్రుడైన భగత్ సింగ్ తో కలిసి హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లిక్ అసోసియేషన్ స్ధాపించి దేశం కోసం విప్లవ, సాయుధ పోరాటాలు చేసిన వీరుడు, అతిచిన్న వయసులోనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన పౌరుషం, ఆత్మాభిమానం గల దేశభక్తుడు చంద్రశేఖర ఆజాద్.!

సాయుధ పోరాటంతోనే స్వాతంత్ర్యం వస్తుందనీ, శాంతి వచనాలతో స్వాతంత్ర్యం సాధించలేమనీ , రక్తం చిందించైనా భారతీయుల ఉనికిని కాపాడాలనీ నమ్మిన ఆజాద్, అదే భావజాలం ఉన్న యువకులను కలుపుకుంటూ వారిలో స్పూర్తిని కలిగించేవాడు. అదే సమయంలో బ్రిటీష్ పార్లమెంటుపై దాడి కేసులో ఉరిశిక్ష విధించబడ్డ తన మిత్రులైన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల బృందాన్ని విడిపించాలని ఎంతగానో ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో భాగంగా 1931 పిబ్రవరి 27 తెల్లవారుజామున నెహ్రూని కలసి విప్లవ వీరులైన భగత్ సింగ్, సుఖదేవ్, రాజ్ గురు లను విడిపించేందుకు సహకరించాలని వేడుకున్నాడు.

కానీ భగత్ సింగ్ బయటికొస్తే తన శాంతి సిద్దాంతాలకి కాలం చెల్లుతుందని భావించిన గాంధీలాగే, భగత్ సింగ్ ఉద్యమ నాయకుడిగా మరింత ఎదిగితే తన నాయకత్వానికి నష్టం కలుగుతుందని భావించిన నెహ్రూ కూడా ఆ విషయంపై ఏమాత్రం స్పందించకుండా, ఏ సమాదానము చెప్పకుండా మౌనంగా ఉండిపోవడం గమనించి నాయకత్వ వ్యామోహం కలిగిన కొందరు స్వార్ధ దేశనాయకుల ప్రమేయంతో ఉద్దేశ్యపూర్వకంగానే భగత్ సింగ్ బృందం బ్రిటీష్ వారికి బలి కాబోతుందని గ్రహించి భగత్ సింగ్ ను తానే విడిపిస్తానని ఆజాద్ ఆవేశంగా నెహ్రూ దగ్గరి నుంచి బయటికి వచ్చి సరాసరి కొందరు మిత్రులతో కలిసి ఆల్ఫ్రెడ్ పార్క్ లో సమావేశం అయ్యాడు.

వారితో కలిసి భగత్ సింగ్ ను విడిపించడానికి ప్రణాళిక సిద్దం చేస్తుండగానే ఎవరో చెప్పినట్లుగా బ్రిటీష్ పోలీసులు అక్కడికి వచ్చి మెరుపుదాడి చేయడం, ఎనోసార్లు బ్రిటీష్ వారి కళ్ళు గప్పి తప్పించుకున్న ఆజాద్ ఊహించని విధంగా పోలీసుల చేతికి చిక్కడం వెనుక ఉన్న రహస్యం ఏంటనేది పబ్లిక్ సీక్రేట్. తమకంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంటున్న ఎందరో స్వాతంత్ర్య సమరయోధులను ప్రణాళికాబద్ధంగా బ్రిటీష్ వారికి బలి చేసిన ఈ అదృశ్య హస్తం ఎవరిదో చాలామందికి తెలుసు.చుట్టుముట్టిన బ్రిటీష్ వారితో అత్యంత ధైర్యంగా రివాల్వర్ తో పోరాడి ముగ్గురు బ్రిటీష్ పోలీసులను చంపినప్పటికీ తన తుపాకీలో బుల్లెట్లు లేకపోవడం తో వారి చేతిలో ప్రాణాలు కోల్పోవడం ఇష్టం లేక తప్పనిసరి పరిస్ధితిలో భారత మాతని తలుచుకుంటూ తనని తానే కాల్చుకుని చనిపోవడంతో చంద్రశేఖర్ ఆజాద్ అధ్యాయం ముగిసిపోయింది.

ఈరోజు (27/2/1931) దేశ స్వాతంత్ర్యం కోసం జీవితాన్ని అంకితం చేసి , తన ప్రాణలను సైతం తృణప్రాయంగా అర్పించిన నిజమైన దేశభక్తుడు చంద్రశేఖర్ ఆజాద్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat