ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ బహరేన్ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ప్రెసిడెంట్ రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ… పుల్వామా అమరవీరుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం పట్ల యావత్ దేశం సీఎం కేసీఆర్‌ను అభినందిస్తుందన్నారు. కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ సమతూకంగా ఉందన్నారు. వ్యవసాయం, మౌలికసదుపాయాలు, ఆరోగ్యం, విద్య, సంక్షేమ రంగాలకు కేటాయింపులు సమతూకంగా జరిగాయన్నారు. మేనిఫెస్టోలో చేసిన వాగ్ధానాలన్నీ టీని నెరవేర్చే విధంగా ఉన్నాయన్నారు. పెన్షన్లు, రైతు బంధు, రుణమాఫీ పథకాల కోసం పూర్తి స్థాయిలో కేటాయింపులు ఉన్నాయన్నారు. అత్యధికంగా నీటి పారుదల శాఖకు రూ. 22,500 కోట్ల నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు కేటాయించారు. మొత్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైతుబంధు కోసం రూ. 12 వేల కోట్లు, రైతుబీమా కోసం రూ. 650 కోట్లు కేటాయించారు.బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్లు అత్యధికంగా నీటి పారుదల శాఖకు రూ. 22,500 కోట్ల నిధులు కేటాయించారు. వ్యవసాయ రంగానికి కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. చరిత్రలోనే మొదటిసారిగా రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ శాఖకు రూ. 20,107 కోట్లు కేటాయించారు. మొత్తంగా 2019-20 ఆర్థిక సంవత్సరానికి రూ. 1,82,017 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రైతుబంధు కోసం రూ. 12 వేల కోట్లు, రైతుబీమా కోసం రూ. 650 కోట్లు కేటాయించారు.బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.