ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి.జంపింగ్ చేస్తున్న నేతలను బుజ్జగింపులు,వేరే పార్టీల నుండి వస్తున్న వారికి ఆహ్వానాలు పలుకుతున్నారు.ప్రస్తుతం ఏపీలో ఎక్కువుగా టీడీపీకి గుడ్ బై చెప్తూ వైఎస్ఆర్సీపీ లోకి వెళ్తున్నారు.ఆంధ్రప్రదేశ్ లో అందరి చూపు ప్రస్తుతం జగన్ పైనే ఉంది.చంద్రబాబు పై ఎక్కువగా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు ఎలా వ్యహరిస్తారు అనేది తెలియాలి.
ఈ రెండు పార్టీలు ఇలా ఉండగా ఇక జనసేన దగ్గరకు వస్తే చాలా దారుణంగా ఉందనే చెప్పాలి.చేతిలో అధికారం లేకపోయినా పర్వాలేదు నేను ఎల్లప్పుడూ ప్రజల తరపున పోరాడుతూనే ఉంటా..ప్రశ్నిస్తూ ఉంటా అని భారీ సినిమా డైలాగ్స్ వేస్తారు.కాని ఇవి పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే అన్నట్లుగా తెలుస్తుంది.ఎందుకంటే ప్రశ్నించాల్సిన సమయంలో మౌనంగా ఉంటూ కాళీ సమయంలో డైలాగులు వేస్తారు.అయితే కొన్ని రోజులు బాబుపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ గత రెండు నెలలుగా ఎందుకు సైలెంట్ అయ్యారు అని అందరికి ఒక ప్రశ్నగా మారింది.
అయితే అసలు విషయం ఏమిటంటే టీడీపీ,జనసేన ఎన్నికల్లో మరోసారి పొత్తు పెట్టుకొని పోటీ చేయడానికి సిద్దమవుతున్నారని సమాచారం.పొత్తులపై ఇప్పటికే ఒక అవగాహన కుదిరినట్టు తెలుస్తుంది.జనసేనకు 25అసెంబ్లీ సీట్లు,3ఎంపీ సీట్లు ఇచ్చే దిశగా చర్చలు సాగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రానున్న నేపధ్యంలో వీరిద్దరూ భేటీ అయ్యరాని తెలుస్తుంది.ఏయే స్థానాలలో ఎవరెవరిని పోటీకి దింపాలి అనేదానిపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది.అయితే వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకొని ఏ ముఖం పెట్టుకొని జనాలు మధ్యకు వెళ్ళాలి అనేదానిపై తర్జన భర్జన పడుతున్నారు.