శుక్రవారం తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.సభ ప్రారంభం కాగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పుల్వామా ఉగ్రదాడిలో అమర వీరులైన జవాన్లకు సంతాపం తెలుపుతూ తీర్మానం ప్రవేశపెట్టారు.అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.అంతే కాకుండా ఉగ్రదాడిలో మరణించిన 40మంది జవాన్ల కుటుంబాలకు మన ప్రభుత్వం ద్వార రూ.25 లక్షల చొప్పున ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారు.జవాన్లకు నివాళి అనంతరం కీసీఅర్ జీఎస్టీ చట్టానికి తీసుకువచ్చిన సవరణ బిల్లును ప్రతిపాదించనున్నారు.అనంతరం సీఎం కేసీఆర్ 2019-20 సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.మరోవైపు శాసనమండలిలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ బడ్జెట్ ప్రవేశపెట్టారు.