హైదరాబాద్ నగరంలోని మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ పరిధిలోని ఐదు ఐసీడీఎస్ ప్రా జెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న మెయిన్ అంగన్‌వాడీ టీచర్లు, మినీ అంగన్‌వాడీ టీచర్లు, అంగన్‌వాడీ సహాయకురాళ్ల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థినులు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఖా ళీలు, విద్యార్హత, రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు 22 నుంచి http://wdcw.tg.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. చార్మినార్ ప్రాజెక్ట్ పరిధిలో 5 అంగన్‌వాడీ టీచర్, 25 అంగన్‌వాడీ సహాయకురాళ్ల పోస్టులు, గోల్కొండ పరిధిలో 5 అంగన్‌వాడీ టీచర్, 25 సహయకులు, ఖైరతాబాద్ పరిధిలో 13 అంగన్‌వాడీ టీచర్, 29 సహయకుల పో స్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. నాంపల్లి పరిధిలో 13 అంగన్‌వాడీ టీచర్, 29 సహాయకుల, సికింద్రాబాద్ పరిధిలో 6 అంగన్‌వాడీ టీచర్, ఒక మినీ అంగన్‌వాడీ టీచర్, 21 సహాయకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు.
Tags anganwadi school notification teacher telangana