కొండవీడు వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొనింది. వైఎస్ఆర్సీపీ నిజనిద్ధారణ కమిటీ కొండవీడు చేరుకున్నారు.అయితే ఈ కమిటీ సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు.దీంతో వైసీపీ నేతలు పోలీసులపై వాగ్వాదానికి దిగారు.పోలీసులు అడ్డుకోవడంతో తమ వాహనాలను అక్కడే వదిలేసి బీసీ రైతు కోటయ్య ఇంటి వరకు నడుచుకుంటూ వెళ్లారు. వైఎస్సార్ సీపీ నేతలు వెళ్లిన వెళ్ళిన పోలీసులు కొండవీడులోకి వాహనాలను అనుమతిచ్చారు.కోటయ్య ఇంటికి వెళ్ళిన కమిటీ సభ్యులు ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు.అంతేకాకుండా కోటయ్య మరణానికి గల కారణాలు గురించి అడిగి తెలుసుకున్నారు.
