నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులకు ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ శాఖ హార్దిక శుభాకాంక్షలు. ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిన్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, స్వీట్లు పంచుకొని సంబరాలు నిర్వహించరు. అనంతరం ఎన్నారై టీఅర్ఎస్ సెల్ బహరేన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ మాట్లాడుతూ…నూతనంగా ప్రమాణస్వీకారం చేసిన మంత్రులు ముఖ్యమంత్రిగారికి పూర్తి సహాయ సహాకారాలు అందించి తెలంగాణ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి సాదించింది మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాల్లో గులాబీ జెండా ఎగిరిన విషయం మనకు తేలినదే.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగురుతుని .
ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని, వారు ప్రవేశ పెట్టిన ప్రభుత్వ పథకాలను విన్నూత రీతిలో మన వంతు పాత్ర పోషించి సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లని ప్రభుత్వ వ్యతిరేకులకు పథకాలతోనే సరైన సమాధానం ఇవ్వాలని పేర్కొంటు ఈ ఎన్నికల్లో ఎలాగైతే గల్ఫ్ నుండి పార్టీ తరుపున ప్రచారం చేసి గెలిపించామో 2019లో ఫెడరల్ ఫ్రంట్ లో కూడా పార్టీ అధికారంలో రావడానికి కృషి చేస్తామన్నారు. మరియు అలాగే ఎన్నారై టిఆర్ఎస్ బహ్రెయిన్ కు సలహాలు సూచనలు అందిస్తు సెల్ ను ప్రోత్సహిస్తున్న ఎంపీ శ్రీమతి కల్వకుంట్ల కవిత గారికి మంత్రి కేటీఆర్ గారికి తెరాస ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల కు మరియు పార్టీ నాయకులందరికి కృతజ్ఞతలు తెలుపుతూన్నాము.
ఈకార్యక్రంలో పాల్గొన్న అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్,జనరల్ సెక్రటరీ లింబాద్రి పుప్పాల,రాజేందర్ మగ్గిడి, గంగాధర్ గుమ్ముల,సెక్రటరీరాజేందర్ రావు చెన్నమనేని,దేవన్న బాల్కొండ,జాయింట్ సెక్రటరీ
సాయన్న కొత్తూరు,ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గణేష్ నుకాల ,రాజ్ కుమార్,నరేష్ ఎల్లుళ్ల తదితరులు పాల్గొన్నారు.