ఏపీ మంత్రి మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సాక్షర భారత్ విలేజ్ కోర్డినేటర్లు మంత్రి గంటా ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటుగా 9 నెలులుగా ఉన్న బకాయిని తీర్చాలని భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 21 వేల మంది విలేజ్ కోర్డినేటర్లు రోడ్డున పడ్డారని వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని ఏఐటీయుసీ ఆధ్వర్యంలో గంటా ఇంటివరకూ పెద్దఎత్తున నినాదాలతో ర్యాలీ చేపట్టారు. ఆందోళన ఉదృతంకావడంతో పోలీసులు రంగంలోకి దిగి నిరసనకారులను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. న్యాయం చేయమని కోరినందుకు ఈ విధంగా చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు.
