గత కొంతకాలంగా సరైన హిట్ లేక అల్లాడుతున్న మెగా పవర్ స్టార్ రాంచరణ్‌కు తాజాగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో నటిస్తున్న రంగస్థలం సిన్మా ఆ కరువుతీర్చేలా ఉంది..సుకుమార్ తన రెగ్యులర్ కన్‌ప్యూజ్డ్ , సైకలాజికల్ కథలను పక్కన పెట్టి చెర్రీ కోసం విలేజ్ నేటివిటిలో ఓ డిఫరెంట్ లవ్ స్టోరీని పక్కా స్క్రిప్ట్‌తో తెరకెక్కిస్తున్నాడు. సమంతా, చెర్రీ కాంబినేషన్, దేవీశ్రీ మ్యూజిక్ ఈ సిన్మాపై మరింత అంచనాలు పెరిగాయి. రంగ స్థలం మూవీకి సంబంధించి బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరుగుతోంది. అయితే ఈ మధ్య స్థార్ హీరోల సిన్మాలు 100 , 120, కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతూ , హైప్ క్రియేట్ చేసి అంతే విధంగా బిజినెస్ చేస్తున్నాయి. చివరకు విడుదల అయ్యాక బాక్సాఫీస్ వద్ద బోల్తో కొడుతుండడంతో బయ్యర్లు భారీ నష్టాలు చవిచూస్తున్నారు..దసరా సందర్భంగా విడుదలైన మహేష్ స్పైడర్ దాదాపు 60 కోట్ల భారీ నష్టం చవిచూడగా, హిట్ అనిపించుకున్న జూనియర్ లవకుశ 100 కోట్లు కలెక్షన్ సాధించినా ఇంకా బయ్యర్లు సేఫ్ జోన్లోకి రాలేదు..దీంతో లవకుశ సిన్మాతో కూడా బయ్యర్లు లాభాలు సంగతి అటుంచి పెట్టిన పెట్టుబడి వస్తే చాలనుకుంటున్నారు. అయితే రాంచరణ్‌తో రంగస్థలం సిన్మా రూపొందిస్తున్న మైత్రి మూవీస్ మాత్రం ఓ పక్క భారీగా చిత్రాన్ని నిర్మిస్తూను బడ్జెట్‌ను కంట్రోల్ చేస్తుంది. ఈ సిన్మాలో బోలేడు భారీ యాక్షన్ సీన్స్, ఫైట్స్ ప్లాన్ చేశాడు డైరెక్టర్ సుకుమార్. అయితే బడ్జెట్ మాత్రం రూ. 60 కోట్ల లోపే ఫినిష్ చేయాలని యూనిట్ భావిస్తుంది..అలాగే పబ్లిసిటీ, ప్రీరిలీజ్ ఖర్చులు కలుపుకుంటే మహా అంటే ఇంకో 5 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే మొత్తం రూ. 65 కోట్లలోపై సిన్మా ఫినిష్ అవుతోంది. రాం చరణ్ కూడా ప్రెస్టేజియస్కు పోకుండా బడ్జెట్ కంట్రోల్‌కు సహకరిస్తున్నాడని యూనిట్ చెబుతోంది. ఇక రంగ స్థలం సిన్మా బిజినెస్‌లో దూసుకుపోతుంది. శాటిలైట్, డిజిటల్, అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్ ఇలా అన్నీకలిపి 30 కోట్లకు పైగా రాబట్టేస్తోంది.. అంటే ఇంక థియేటర్ రైట్స్ ద్వారా రావాల్సింది జస్ట్ ముఫై అయిదు కోట్లు మాత్రమే. ఈ మాత్రం అమౌంట్ కేవలం రాంచరణ్‌కు ఆదరణ ఉన్న ఆంధ్ర-సీడెడ్ లు కలిపి వచ్చేస్తుంది. ఇక నైజాం, ఓవర్ సీస్, కర్ణాటక వుండనే వుంటుంది. ప్రస్తుతానికి రంగస్థలం సిన్మాకు ఉన్న బజ్ బట్టి హిట్ , ఫ్లాప్‌తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ అయితే కొల్లగొడుతుంది..ఫస్ట్ వీక్ కలెక్షన్స్‌తో ఈజీగా 65 కోట్లు రాబడుతుందని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా ఉంది..ఇక పాటలు హిట్ అయితే ఓపెనింగ్స్ ఇంకా భారీగా ఉండే అవకాశం ఉంది.. యావరేజ్ సిన్మాతో 50 నుంచి 60 కోట్లు ఈజీగా రాబట్టే కెపాసిటీ చెర్రీ సొంతం. ఇక హిట్ టాక్ అందుకుంటే మాత్రం రాంచరణ్ బాక్సాఫీసును దున్నేస్తాడని..ఈజీగా 120 నుంచి 150 కోట్లు కొల్లగొడుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి..ఎలాంటి ఈగో లేకుండా 65 కోట్ల బడ్జెట్లో సిన్మాను క్లోజ్ చేస్తున్న చెర్రీని నిర్మాతలు అభినందిస్తున్నారు. స్టార్ హీరోలంతా చెర్రీ బాటలో ఇగోలు తగ్గించుకుని బడ్జెట్ లిమిట్ చేసుకుంటే తమకు టెన్షన్ ఉండదని, బయ్యర్లు కూడా సేఫ్‌గా ఉంటారని నిర్మాతలు అంటున్నారు..ఈ మధ్య బడ్జెట్ దాటుతుంది షెడ్యూల్లో ఒక రోజు తగ్గించుకోమంటే థర్డీ ఇండస్ట్రీ అని చెప్పుకునే ఓ పెద్ద ప్యామిలీకి చెందిన హీరో సదరు చిత్ర నిర్మాతను బండబూతులు తిట్టినట్లు సమాచారం..అలాంటి స్టార్ హీరోలు చిన్నవాడైన చెర్రీని చూసి నేర్చుకోవాలంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు..ఏమైనా ఉపాసనతో మ్యారేజీ అయ్యాక చెర్రీలో మెచ్యూరిటీ పెరిగింది..గుడ్ హ్యూమన్‌బీయింగ్‌గా పేరుతెచ్చుకుంటున్నాడు..చెర్రీ ఇలాగే బడ్జెట్ కంట్రోల్‌తో సిన్మాలు తీస్తే నిర్మాతలు క్యూ కడుతారనడంలో సందేహం లేదు.
