ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో టీడీపీకి కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి.పెద్ద నాయకులు సైతం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్తున్నారు.తాజాగా కర్నూల్ జిల్లాలో ఆళ్లగడ్డకు చెందిన టీడీపీ కీలక నేత ఇరిగెల రాంపుల్లారెడ్డి వైసీపీ తీర్ధం పుచ్చుకోడానికి ముహూర్తం ఫిక్స్ చేసారు.ఈ మేరకు ఈరోజు అయన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కలవనున్నారు.భేటీ అనతరం రాంపుల్లారెడ్డి వైసీపీ కండువా కప్పుకుంటారు.
రాంపుల్లారెడ్డి ఆళ్లగడ్డలో టీడీపీకి ముఖ్య నేత అంతేకాక ఆ పార్టీ ఇంచార్జ్‌గా కూడా అయన పనిచేసారు.మంత్రి అఖిల ప్రియ అరాచకాలకు పాల్పడుతోందంటూ ఇరిగెల అప్పట్లో ఆరోపించిన విషయం అందరికి తెలిసిందే.పోయిన ఏడాది డిసెంబర్ లో అయన పార్టీ సభ్యత్వానికి గుడ్ బాయ్ చెప్పారు.అభిమానులు,స్నేహితులు కోరిక మేరకు రాంపుల్లారెడ్డి వైసీపీలో చేరబోతున్నారని సమాచారం.