పశ్చిమగోదావరి జిల్లాలోగల తుందుర్రులో ఆక్వాపార్క్ నిర్మాణం వద్దంటూ మూడేళ్లుగా వేల మంది ప్రజలు ఆందోళన చేస్తున్నా పట్టించుకోకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మూర్ఖంగా గ్రామాల్లో అరాచకాలు సృష్టిస్తున్నారు. దీంతో ఆక్వాపార్క్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులతో తమపై అక్రమ కేసులు బనాయించి, జైలు పాలు చేసి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారు. మూడు సంవత్సరాలుగా ముప్పై గ్రామాల ప్రజలు ఉద్యమం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్టుగా లేదు.. చంద్రబాబు సర్కార్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని ఆక్వా బాధితులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
ఆక్వాపార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా బాధితులు చేపట్టిన ఉద్యమం తారా స్థాయికి చేరింది. ఈ విషయంపై తాము ఎన్నిసార్లు ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దీంతో ఈ రోజుటినుంచి చంద్రబాబు సర్కార్‌కు వ్యతిరేకంగా ఆక్వా బాధితులు చేపడుతున్నట్లు దీక్ష చేపట్టనున్నారు.
అయితే, గతంలో తుందుర్రులో పర్యటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ని తరలించేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. బాధితులకు తమవంతు నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు.