Home / 18+ / తెలంగాణ‌కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌..ప్ర‌శంసించిన కేటీఆర్‌

తెలంగాణ‌కు మ‌రో ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌..ప్ర‌శంసించిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ర్టానికి ప్ర‌ముఖ కంపెనీల రాక కొన‌సాగుతోంది. తాజాగా చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య‌కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్‌, ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ ఈ ఒప్పంద ప‌త్రాలు మార్చుకున్నారు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పాటు స్టార్టప్‌లకు సహాయం చేసేందుకు ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ ఒప్పో ఓ ప్రకటనలో వివరించింది. స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్లకు అండగా ఉండేందుకు, వివిధ నైపుణ్యాల్లో వాళ్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఒప్పో సంస్థ స్టార్టప్‌లకు సంబంధిత అంశాల్లో నైపుణ్య సంబంధ సహాయం, మెంటరింగ్ కల్పించనుండగా ప్రభుత్వం తరఫున తగు ఎకోసిస్టమ్‌ను అందించనున్నారు. కెమెరాలు, ఇమేజింగ్ ప్రాసెస్, బ్యాటరీ, 5జీ నెట్‌వర్క్స్, సిస్టమ్ పర్‌ఫార్మామెన్స్, పేమెం ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్ రంగాల్లో ఈ సహాయ సహకారాలు ఉండనున్నాయి.

ఒప్పో ఆర్‌ఆండ్‌డీ ఇండియా హెడ్ తస్లీమ్ ఆరిఫ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల మార్కెట్‌ను ప్రభావితం చేసే ఆవిష్కరణలు రానున్నాయి అన్నారు. దేశంలోని మొబై ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఆయా స్టార్టప్‌లు చూపించే పరిష్కార మార్గాలను అనుసరించి స్టార్టప్‌ల ఎంపిక ఉండనుంది.కాగా, ఈ ఒప్పందం ప‌ట్ల టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఇలాంటి ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌లు మ‌రిన్ని రావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat