ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం ఆయనే మళ్ళీ గెలవబోతున్నారు, తానే మళ్ళీ గెలవాలి, తాను గెలవకపోతే మీకు దిక్కులేదు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలతో ఎంతలా మైండ్ గేమ్స్ ఆడాలని చూసినా ప్రజలు మాత్రం పూర్తిగా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నారు.ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష వైసీపీకి జోరు పెరిగేలా మరో సర్వే అంచనాలు ముందుకొచ్చాయి.ఇప్పటికే టైమ్స్ నౌ లాంటి ప్రముఖ జాతీయ ఛానల్స్ వైకాపా భారీ విజయం ఖాయమని చెప్పగా,ఇప్పుడు తాజాగా వీడీపీ అసోసియేట్స్ సర్వే ఏపీలో జగన్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేల్చి చెప్పింది.
ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలన్నీ కూడా వైకాపాకు గెలుపు ఖాయం అని చెప్పిన విషయం తెలిసిందే.అయితే ఈ సర్వే ప్రకారం దాదాపు 45శాతం పైగా ఓటింగ్ తో వైకాపా ఘన విజయం సాధించడం ఖాయమని తెలుస్తుంది.కాగా మొత్తం 25ఎంపీ స్థానాలను గాను 21 స్థానాలను వైకాపాకు కట్టబెట్టింది.టీడీపీ మాత్రం కేవలం 37.2 శాతం ఓట్లతో నాలుగు సీట్లకు పరిమితమవుతుంది. ఇక జనసేన వచ్చే ఎన్నికల్లో అంతంత మాత్రమే ప్రభావం చూపుతుందని సర్వే అంచనా వేసింది.పవన్ పార్టీ 5.9 శాతం ఓట్లను సాధించగా ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెల్చుకోలేదని స్పష్టం చేసింది.బీజేపీ 7.13 శాతం ఓట్లను తన ఖాతాలో వేసుకోనుందని సర్వే వెల్లడించింది.
ఇప్పటికే చంద్రబాబు ఓటమి భయంతో రకరకాల వేషాలు వేస్తూ అబద్ధపు ప్రచారాలతో ప్రజలను మబ్బి పెట్టాలని చూస్తున్నాడు.ఇక ఈ సర్వే అనంతరం ఇంకా భయం పెరుగుతుందని సాక్షాత్తూ టీడీపీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నపరిస్థితి ఏర్పడింది.మునిపటిలా కాకుండా ఈసారి ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా వైసీపీ నేతలు,కార్యకర్తలు కష్టపడుతున్న తీరు చూస్తుంటే బాబుకు మరింత ఆందోళన పెరగనుంది.అయితే బాబు మార్క్ రాజకీయాలకు కాలం చెల్లిందన్న విశ్లేషకుల మాటలు నిజం కానున్నాయా? వేచి చూడాలి.