తాను మెగాస్టార్ అభిమానినంటూ ఓ యువతి మద్యం మత్తులో రైల్లో వీరంగం సృష్టించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్రాథ్ రైలు లో స్లీపర్ క్లాస్లో యువతి చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది. తనకు ఇక్కడ ఉన్న వెధవుల మధ్య బర్త్ వద్దని సెపరేట్గా సీటు కేటాయించాలని వాదనకు దిగింది. ‘‘మెగాస్టార్ అంటే ఈకట…ఆడికి చెప్పానంటే దూలతీర్చేస్తాడు. మెగాస్టార్ అంటే ఏమైనా ఈక ముక్కా..!’’ అని గోలచేస్తూ తోటి ప్రయాణీకులకు ఇబ్బంది పెట్టింది. వారు ఎంత సర్ది చెప్పినా వినకుండా నానా హంగామా చేసింది. చదువు ఉందని గొప్ప అనుకోవద్దని, చిరంజీవి సినిమా చూశారో…అని చిటికవేస్తూ… చూడొద్దని మరో యువతికి వార్నింగ్ ఇచ్చింది. రైల్లో తోటి ప్రయాణీకుడు తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ ఆడకూతురు అబల కాదు సబల…. సికింద్రాబాద్ టు విశాఖపట్నం గరీబ్ రధ్ ట్రైన్ లో ఒక అమ్మాయి ఫుల్లుగా తాగి చేసిన రచ్చ చూడండి.
Опубліковано తెలుగుజాతి మనది Telugu Community 14 жовтня 2017 р.