Home / 18+ / నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేప‌ని కాదు

నిపుణుల మాటః మోడీ రైతుబంధు అయ్యేప‌ని కాదు

రైతుల జీవితాల బాగు కోసం కాకుండా ఓట్ల ఎత్తుగ‌డ‌లో భాగంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్ర‌వేశ‌పెట్టిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిపై ఆదిలోనే నీలినీడ‌లు క‌మ్ముకుంటున్నాయి. ఈ ప‌థ‌కం అమ‌లు అయ్యేప‌ని కాద‌ని నిపుణ‌లు స్ప‌ష్టం చేస్తున్నారు. బడ్జెట్‌లో భాగంగా ఆర్థిక మంత్రి పియూష్ గోయ‌ల్ ఐదు ఎకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6 వేలు ఇస్తామని, అందులో తొలి విడత రూ.2 వేలు ఈ ఏడాదే ఇస్తామనీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఉన్న 12 కోట్ల మంది రైతులకు ఈ పథకం ఉపయోగపడనుందని పియూష్ గోయల్ వెల్ల‌డించారు.

అయితే, ఈ ప‌థ‌కంపై దేశ‌వ్యాప్తంగా ఉన్న నిపుణులు పెద‌వి విరుస్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్ ఎన్‌కే పొద్దార్ మాట్లాడుతూ “దీని అమలుకు రూ.75 వేల కోట్లు ఖర్చు కానున్నట్లు అంచనా వేశారు. అయితే ఈ రూ.6 వేలు సరిపోతాయా లేదా అన్నది పక్కన పెడితే.. దీని అమలు మాత్రం చాలా కష్టం. దీనికి న్యాయపరమైన చిక్కులు తప్పవు. భూయాజమాన్య హక్కులపై ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పథకం అమలుకు అడ్డంకిగా మారవచ్చు“ అని స్ప‌ష్టం చేశారు. “టైటిల్ డీడ్‌లో ఒకరి పేరున్నంత మాత్రాన ఆ భూమిపై యాజమాన్య హక్కులు అతనికే దక్కవని, న్యాయపరమైన పోరాటంలో ఇతరులు కూడా యాజమాన్య హక్కుల కోసం పోరాడవచ్చని ఈ మధ్య సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ లెక్కన ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే.. అందరూ ఆ రూ.6 వేల సాయం అందుకుంటారని పొద్దార్ చెప్పారు. అందువల్ల మొదటి విడత సాయం రూ.2 వేలు ఇవ్వడం కూడా ఓ సవాలే“ అని పొద్దార్ తేల్చిచెప్పారు.

జాదవ్‌పూర్ యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్ సైకత్ సిన్హా రాయ్ మాట్లాడుతూ “రూ.75 వేల కోట్ల మొత్తం ఇలా పంచితే వృథాగా పోయినట్లే “ అని అభిప్రాయపడ్డారు. ఇదే మొత్తాన్ని పెట్టుబడి సాయంగా లేదా మంచి ధరలు కల్పించడానికి ఉపయోగించవచ్చని, దీని ద్వారా ఆర్థిక లబ్ధి పొందే అవకాశం ఉండేదని ఆయన చెప్పారు. దీని కారణంగా ఒక భూమికి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉంటే ఆ భూమికి సంబంధించి ఎక్కువ మందికి ఆర్థిక సాయం చేయాల్సిన పరిస్థితి కలుగుతుందని రాయ్ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat