రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం పసుపు– కుంకుమ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదికలు పలుచోట్ల రికార్డు డాన్స్ ప్రోగ్రాంలా తయారయ్యాయి.ఈ పథకం కింద డ్వాక్రా సంఘాల్లో మహిళలకు పోస్టు డేటెడ్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి గ్రామానికి మొదటి విడతలో సగటున రూ. 25 వేలు చొప్పున గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నిధులు మంజూరు చేసింది.అయితే మరోపక్క జాతీయ జీవనోపాధుల పథకం అమలుకు మన రాష్ట్రానికి రూ. 31.60 కోట్లు కేంద్రం ఇచ్చింది.ఈ సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఈ డబ్బులతో స్థానిక టీడీపీ నేతలు, జన్మభూమి కమిటీ సభ్యులు రికార్డింగ్ డాన్స్‌లకు వేదికలుగా మార్చారు.పట్టపగలే రికార్డింగ్ డాన్స్‌లు చేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.ఇంత జరుగుతున్న ప్రభుత్వ యంత్రాంగం ఎందుకు అనుమతి తెలుపుతోందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.