పాకిస్తాన్ లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు.ఖంబర్-షాదాద్కోట్ కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా భాద్యతలు నిర్వర్తించనున్నారు.హైదరాబాద్లో ఎల్ఎల్బీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. పాక్లో తొలిసారిగా హిందువుల్లో జస్టిస్ రాణా భగవాన్దాస్ జడ్జిగానియమించగా 2005 నుండి 2007 మధ్య స్వల్ప కాల వ్యవధుల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా పనిచేశారు.