తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందుకు తమకు పట్టం కడతారు అని తెగ ఆనందపడ్డారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు .కానీ దాదాపు పద్నాలుగు యేండ్ల పాటు పోరాడి అరవై యేండ్ల స్వరాష్ట్ర కలను సాకారం చేసిన ఉద్యమ పార్టీ అయిన తెలంగాణ రాష్ట్ర సమితికి పట్టం కట్టారు .ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు గత మూడున్నర ఏండ్లుగా పలు అభివృద్ధి పనులను అమలు చేస్తూ రాష్ట్రంలో వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా ప్రజాకర్షక పాలనను కొనసాగిస్తుంది .
ఒకవైపు ప్రజాపాలన కొనసాగిస్తూనే మరో వైపు గత అరవై ఏండ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ,టీడీపీ పార్టీ ఏ విధంగా మోసం చేశాయో వివరిస్తూ సాగునీటి ప్రాజెక్టుల దగ్గర నుండి త్రాగునీటి ప్రాజెక్టుల వరకు ..సంక్షేమ కార్యక్రమాల దగ్గర నుండి అభివృద్ధి కార్యక్రమాల వరకు అన్నిటిని అమలు చేస్తూ ప్రజల్లో రోజు రోజుకి ఆదరణను చురగొంటుంది .ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో తము అధికారంలోకి రావడానికి ఒక అస్త్రాన్ని ప్రయోగించబోతుంది టీకాంగ్రెస్ .
ఆ అస్త్రమే ఒకప్పటి స్టార్ హీరో ..రాష్ట్ర విభజన సమయంలో టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి ఆఖరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి .ఆమెకు టీపీసీసీ వర్గంలో కీలక పదవి ఇచ్చి అధికారంలోకి రావడానికి ఆమెను అస్త్రంగా వాడుకోవాలని పార్టీ జాతీయ అధిష్టానం ఆలోచిస్తుంది అంట .చూడాలి మరి అరవై ఏండ్లు సమైక్య రాష్ట్రంలో నలబై ఐదు ఏండ్లు పాటు పాలించిన తమ వలన కాదు కానీ ఇప్పుడిప్పుడే రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటున్న విజయశాంతి వలన అవుతుంది అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆలోచిస్తున్నారు .చూడాలి మరి కేసీఆర్ చరిష్మా ముందు వీళ్ళు నిలబడతారో లేదో ..?