గులాబీ దళపతి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విధానాలు ఇప్పటికే దేశవ్యాప్తంగా రోల్‌మోడల్‌గా నిలవగా…మరోవైపు భారతదేశ రూపురేఖలను మార్చేందుకు ఆయన ప్రతిపాదిస్తున్న ఆర్థిక నమూనాలకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఇప్పటికే రాజకీయ పార్టీలు వాటిపై ఆలోచన చేస్తుండగా, తాజాగా వాటిపై ఆర్థిక నిపుణులు ప్రశంసిస్తున్నారు. దేశం ముందుకు వెళ్ళాలంటే కేసీఆర్ ప్రతిపాదించిన ఆర్థికనమూనానే అనుసరించాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఛైర్మన్ విజయ్‌కేల్కర్ ప్రకటించారు. ఈ ప్రతిపాదనకు తాను మద్దతు పలుకుతున్నానని ఆయన స్పష్టం చేశారు.
తాజాగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సమాఖ్య ఆర్థికవిధానం కోసం నీతిఆయోగ్ 2.0 అవసరమని, రాష్ట్రాలకు బాధ్యతతో కూడిన నిధులు కేటాయించే అధికారం దీనికి ఉండాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఛైర్మన్ విజయ్‌కేల్కర్ విశ్లేషించారు. ప్రజాస్వామ్యంలో ఫెడరల్ ఆర్థికవిధానాల వల్లే అభివృద్ధి సాధ్యమని, ప్రధానంగా విధులు, నిధులు, అధికారాలు రాష్ట్రాలకే ఉండాలని ఆయన స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం 60శాతం రక్షణరంగానికే నిధులు వెచ్చిస్తున్నదని, మిగతా 40శాతం మాత్రమే ప్రజలపై ఖర్చుపెడుతున్నదన్నారు. దేశ ఆర్థికవిధానాలు అసమతుల్యంగా ఉన్నాయని, వీటిలో మార్పుజరిగి దేశం పురోగమించాలంటే కేసీఆర్ ప్రతిపాదించిన న్యూ ఎకనామిక్ పాలసీనే శరణ్యమని ఆయన కుండబద్దలు కొట్టినట్లు తెలిపారు.
కేసీఆర్ ప్రకటించిన న్యూ ఎకనామిక్ పాలసీని అనుసరిస్తేనే దేశం ముందడుగు వేస్తుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ ఛైర్మన్ విజయ్‌కేల్కర్ స్పష్టం చేశారు. నీతిఆయోగ్ కూడా అభివృద్దిలో కీలకపాత్ర పోషించాలన్నా రు. ప్రస్తుతం దేశ ఆర్థికవ్యవస్థ ఒక్క పిల్లర్ మీదే ఉందని, దీనిని త్వరగా మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాఖ్యస్ఫూర్తితో స్థానికసంస్థల వరకు నిధులు తీసుకెళ్తేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందన్నారు. కాగా, తాజాగా కేల్కర్ మాటతో దేశంలో సరికొత్త ఆర్థిక విధానం అమలుకావాలని కోరుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదానికి మద్దతు పెరుగుతోందనేది స్పష్టమవుతోంది.