Home / 18+ / జగన్ పార్టీలోకి జయప్రధ.. మురళీమోహన్ కు ముచ్చెమటలు

జగన్ పార్టీలోకి జయప్రధ.. మురళీమోహన్ కు ముచ్చెమటలు

అప్పట్లో తెలుగు ఇండస్ట్రీ లో అందాల తారగా పేరు గాంచిన హీరోయిన్లులో జయప్రధ ఒక్కరు.ఈమె రాజకియల్లోను అలాగే మెరిసింది.అయితే ఇప్పుడు ఆమె వైసీపీలో చేరేందుకు సిద్దమవుతునట్టు ప్రచారం జరుగుతుంది.దీనిపై జయప్రధ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. సమాజ్‌వాదీ పార్టీ నుండి బయటకు వచ్చిన తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చేరేందుకు సిద్దమవుతునట్లు సమాచారం.సినీ,రాజకీయ రంగంలోను జయప్రధ ఒక వెలుగు వెలిగిన విషయం అందరికి తెలిసిందే.అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్టీఆర్ పిలుపుతో జయప్రధ 1994 టీడీపీలో చేరారు.ఆ తరువాత చంద్రబాబు హయంలో 1996లో రాజ్యసభ సభ్యురాలిగా అవకాశం దక్కింది.

టీడీపీలో కొంత కాలం కొనసాగిన తర్వాత జయప్రద తన స్నేహితుడు ద్వారా సమాజ్ వాదీ పార్టీలో చేరి యూపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు.ఆ పార్టీ ద్వార రాజ్యసభ సభ్యురాలిగా చాలా ఏళ్ళు కొనసాగారు.యూపీ శాసనసభ ఎన్నికల సమయంలో అమర్‌ సింగ్ ను అప్పటి ఎస్పి అధినేత అఖిలేష్ యాదవ్ పార్టీ నుండి సస్పెండ్ చేయటంతో జయప్రద కూడ ఆ పార్టీ నుండి బయటకు వచ్చారు.అక్కడ రాజకీయాల్లో జయప్రధకు ఇబ్బందులు రావడంతో ఏపీ రాజకీయాల వైపు దృష్టి పెట్టినట్టు సమాచారం.ఇక్కడ ఏ పార్టీలో చేరాలి అనేదానిపై కొంత సమయం తీసుకున్నతరువాత చివరకు వైసీపీలో చేరాలనే యోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది.

అంతా బాగుంటే వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో ఆమె ప్రతిష్టాత్మక రాజమహెంద్రవరం నుండి పోటీ చేసేందుకు సన్నాహలు చేసుకొంటున్నారని చెబుతున్నారు.ప్రస్తుతం ఇక్కడ సినీనటుడు మురళీ మోహన్ టీడీపీ ఎంపీగా ఉన్నారు.అయితే జయప్రద ఏ పార్టీలో చేరుతారు, ఎప్పుడు ఏపీ రాజకీయాల్లో అడుగు పెడతారు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు.లోక్‌సభ సీటు లేదా రాజ్యసభ సీటు కావాలని జయప్రద ఆశిస్తున్నారని చెబుతున్నారు.ఈ సస్పెన్స్ కు మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat