ఏపీలోని కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది.మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సోదరుడు కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఫిబ్రవరి 6వతేదీన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఇవాళ ఉదయం హర్షవర్ధన్ రెడ్డి తన కార్యకర్తలతో ముఖ్య సమావేశం నిర్వహించారు. అయితే ముందుగా మాజీ సీఎం కోట్ల విజయభాస్కరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వారంతా వైసీపీలో చేరాలని హర్షవర్ధన్ రెడ్డికి సూచించారు.కార్యకర్తల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకునట్లు తెలిపారు.కాగా సూర్యప్రకాష్ రెడ్డి కూడా కాంగ్రెస్ ను వీడుతునట్లుగా వార్తలు వ అస్తున్న సంగతి తెలిసిందే .