భారతదేశంలో గోవులంటే ప్రత్యేక అభిమానం ఉన్న సంగతిత ఎలిసిందే. అయితే, ఇది కొందరికే పరిమితం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తుంటారు. అయితే, అది తప్పని తాజాగా ఓ ముస్లిం ఎమ్మెల్యే నిరూపించారు. రాజస్థాన్ శాసనసభ సమావేశాలలో ఎమ్మెల్యే అమీన్ ఖాన్ కన్నీరు పెట్టకున్నారు. ఎందుకంటే..ఓ గోవు చనిపోయినందుకు.
అసెంబ్లీ సమావేశాల్లో గో సంరక్షణపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ ఖాన్ మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం పాల వ్యాపారం చేస్తుంటుందనీ..అందుకే ఆవులతో తమకు ఎంతో మమకారం ఏర్పడిందన్నారు. అంతేకాదు తమ కుటుంబ సభ్యుల వలెనే ఆవులతో కూడా ప్రత్యేక అనుంబంధం ఉంటుందనీ..వీటిలో అన్ని ఆవుల్లో కంటే ఒక ఆవును తాను ఎంతో ప్రాణంగా చూసుకునేవాడిననీ..ఆ ఆవు అది ఇటీవలే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మనిషిలాగానే ఆ ఆవు తాను ఇంటి వద్ద వున్నంతసేపు తన పక్కనే వుండేదనీ..దాని ముఖం గుర్తుకు వచ్చినప్పుడల్లా తనకు కన్నీళ్లు ఆగటంలేదనీ అమీన్ ఖాన్ తీవ్ర భావోద్వేగానికి గురవుతు కన్నీరు పెట్టుకున్నారు.