ఏపీలో రాజకీయ వేడి మొదలైంది.ఇప్పటికే కొందరు నేతలు సీట్లు ఇచ్చే పార్టీలను వెతడకడం మొదలుపెట్టారు.ఆశించిన పార్టీలో సీట్లు దొరకని నేతలు పార్టీలు మారేందకు రంగం సిద్దం చేసుకున్నారు.ఇటీవలే వంగవీటి రాధా వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ బరిలో దిగడం లేదని ప్రకటించారు.గత ఎన్నికలలో విజయవాడ పశ్చిమ నుంచి వైసీపీ పార్టీ తరుపున పోటీ చేసి గెలిచిన జలీల్ ఖాన్ పార్టీ మారి అధికార టీడీపీలో చేరారు.
తనకు బదులుగా తన కూతురు షబానా పోటీ చేస్తుందని ఆయన తెలిపారు.దీనిలో భాగంగానే మంగళవారం తండ్రి జలీల్ఖాన్తో పాటు షబానా ముఖ్యమంత్రిని కలిశారు.సీఎం సమక్షంలో షబానా టీడీపీలో చేరారు.ప్రజల్లో తనపై వ్యతిరేకత ఉన్నదని తెలుసుకున్న జలీల్ ఖాన్ బయపడి తన కూతురిని రంగంలోకి దింపుతున్నట్లు తెలుస్తుంది.వైసీపీలో గెలిచి మంత్రి పదవి ఆశించి టీడీపీలో చేరిన ఆయనకు నిరాశే మిగిలింది.ఆ తరువాత ముస్లిం కమ్యూనిటీ ఛైర్మన్ పదవి ఆశించగా అక్కడ కూడా నిరాశే మిగిలింది.ఇక ఆయన ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతు బికాంలో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి తెలుగు రాష్ట్రాలలో భాగానే ఫేమస్ అయ్యారు.