దేశంలో కీలక రిజర్వేషన్‌లోకి అమల్లోకి వచ్చింది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో ఈబీసీ రిజర్వేషన్ల బిల్లు చట్టంగా మారింది. ఈబీసీలకు విద్య, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చట్టసవరణ చేసింది. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు పదిశాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించడంతో ఇవాళ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేయడంతో బిల్లు అమల్లోకి వచ్చింది.
అగ్రవర్ణాలు, అన్ని మతాల్లోని పేదలకు ఉద్యోగాలు, విద్యలో 10% రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఆర్థికంగా వెనుకబడిన ఉన్నత వర్గాల ప్రజల కోసం తయారుచేసిన ఈబీసీ బిల్లుకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. దేశంలో 50% రిజర్వేషన్ దాటొద్దన్న రాజ్యాంగ నిబంధనను సవరించేందుకు 124 అమెండ్ మెంట్ బిల్లు ఇటీవల లోక్ సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందింది. ఈబిల్లును కూడా రాష్ట్రపతి అప్రూవ్ చేశారు. ఈబీసీలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు… గెజిట్ నోటిఫికేషన్ తో చట్టంగా మారింది. ఇకనుంచి అగ్రవర్ణాలు, అన్నిమతాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పదిశాతం రిజర్వేషన్లు లభించనున్నాయి.