ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ చేయని పనులు కూడా తామే చేశామంటు గొప్పలు చెప్పుకుంటుంది.ప్రజలు స్థానిక ప్రజా ప్రతినిధులను తమ సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయమని అడిగితే తప్పుడు ఆరోపణలు, తప్పుడు కేసులు పెడుతున్నారు.
4 సంవత్సరాల కాలంలో చేయలేని పనులు, ఎన్నికలు సమీపిస్తున్నవేల ఇప్పుడు ఈ ఏదాదిలో పూర్తిచేస్తామంటు డబ్బాలు కొట్టడం పై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.ఉన్న సమస్యను ప్రశ్నిస్తే వీరు వైసీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీ నేతలంటు అధికార పార్టీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
సాక్షాత్తు రాష్ట్ర రాజధాని ఐన అమరావతి ప్రాంతంలో రేషన్ కార్డులు జారీ కావు.ఇక ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులకైతే ప్రభుత్వ పథకాలు.అందని ద్రాక్షగా ఉండిపోయాయని చెప్పొచ్చు.రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇచ్చిన ప్రభుత్వ పథకాలు ఏవరేవరికి, ఎలా వచ్చాయి అని నిస్పక్షపాతంగా సర్వే చేస్తే అసలు నిజలు బయటపడతాయి.