దేశచరిత్రలోనే చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అవుతుందని వైయస్ఆర్సీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒక పార్టీ నాయకుడు సంవత్సరం పైగా ప్రజలతో మమేకం కావడం అనేది చ్రరితలో నిలిచిపోతుందన్నారు. జగన్ పాదయాత్రకు చాలా ప్రాముఖ్యత ఉందన్నారు. మాట మీద నిలబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని ప్రజల సంక్షేమం కోసం ఆయన తీసుకువచ్చిన నవరత్నాల పథకాలు పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తంచేస్తున్నారన్నారు. ప్రజలు జననేతను విశ్వసిస్తున్నారని,ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూస్తున్నారన్నారు.
చరిత్రలో అపూర్వ ఘటనలుగా గతంలో వైయస్ఆర్ ప్రజాప్రస్థానం.. షర్మిలమ్మ మరో ప్రజాప్రస్థానం.. వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్రలు నిలిచిపోతాయని ఆపార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. వైయస్ రాజశేఖర్‌రెడ్డి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా వైయస్ఆర్ పరిపాలించారన్నారు. ఒక రూపాయి పన్ను వేయకుండా.. ఒక రూపాయి పన్ను పెంచకుండా సంక్షేమరాజ్యాన్ని నిర్మించారన్నారు. వ్యవసాయ రంగాన్ని ఒక పండగలా చేశారన్నారు. రాబోయే రోజుల్లో ఒక రైతు నాయకుడిని వైయస్ జగన్‌లో చూడబోతున్నామన్నారు.