కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీపై సాయన్య ప్రజలు భగ్గుమన్నారు. జన్మభూమి కార్యక్రమం సాక్షిగా టీడీపీపై పార్టీపై ఒక్కసారిగా బట్టబయటలయ్యాయి. జన్మభూమి కార్యక్రమంలో భాగంగా జన్మభూమి గ్రామసభలు ఏపీ మొత్తం రసాభాసగా మా రుతున్నాయి. నిరసనలు.. నిలదీతలు.. ఆందోళనలు.. బహిష్కరణలు.. ఏ ఊరు చూసినా ఇదే పరిస్థితి. సమస్యలు పరిష్కారం కాగా విసుగు చెందిన ప్రజలకు నిరసనలు తెలిపేందుకు జన్మభూమి సభలను వేదికగా మార్చుకుంటున్నారు. తాజాగా శుక్రవారం కర్నూల్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో జరిగిన సభలు ఇందుకు అద్దం పడుతున్నాయి. … డోన్ నియోజక వర్గంలోని ప్యాపీలీ మండలం కలచట్ల లో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా మారి తీవ్ర ఉద్రిక్తత నేలకోంది. గ్రామంలోని ఆవుల ఒబులపతి,ఆవుల రామ తిమ్మయ్య కుటుంబీకులు 4 ఏళ్ల నుండి రేషన్ కార్డులు, మరుగు దోడ్లు, ఇళ్లు మంజురు చేయ్యలేదని నిలదీయగా కొందరు టీడీపీ నేతలు అడ్డుపడి అడ్డంగా మాట్లాడడంతో రసాభాసగా మారి తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. పోలీసులు ,అధికారుల ముందే ఇలా సభలో నిరసనలు.. నిలదీతలు రావడంతో వారికి అర్థం కాలేదు. అంతేకాదు గ్రామం మొత్తం టీడీపీపై తీవ్ర వ్యతీరేకత రావడంతో కొందరు టీడీపీ నేతలు అయోమయంలో పడ్డారని సమచారం.