Home / 18+ / ఎన్నికలు దగ్గర పడుతున్న శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు

ఎన్నికలు దగ్గర పడుతున్న శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టిన చంద్రబాబు

వైఎస్ జగన్ అనే ఒక నిజాన్ని గెలవడానికి ఎన్నో అబద్ధాలు పోరాటం చేస్తున్నాయి. జగన్ అనే వెలుగును చీకటితో కమ్మేద్దామని కలలు కంటున్నాయి. ప్రతిపక్ష నేత లక్ష్యంగా అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుట్రలకు తెగబడుతున్నాడు. నాలుగేళ్లుగా ప్రజల మద్దతుతో పోరాటం చేస్తున్న జగన్ నిప్పురవ్వను ఆర్పేయాలని విష ప్రయోగాలకు వెనుకాడటం లేదు. గెలవాలంటే నిలవాలనే సిద్ధాంతాన్ని పక్కనపెట్టి గెలవాలంటే అడ్డు తొలగించుకోవాలన్నంత నీచ రాజకీయాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో నడుస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. ఏడాదిగా జగన్‌ ప్రజల మధ్యే ప్రజా సంకల్పయాత్రలో ఉండి అధికార పార్టీపై పోరాడతుంటే చంద్రబాబు మాత్రం జిమ్మికులతో కాలం వెళ్లదీస్తున్నారు.

మూడు సంవత్సరాలు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బయటకొచ్చి ఎన్నికలకు ముందు.. తర్వాత నాలుగేళ్లు మోడీని వీరుడు.. శూరుడు అని పొగిడిన నోటితోనే ఇప్పుడు మోడీని దేశ ద్రోహి.. ఆంధ్రాలో చిచ్చు పెట్టాడని విమర్శిస్తున్నారు. చెంబుడు నీళ్లు, మట్టి ఇచ్చినప్పుడే మిన్నకుండిపోయిన ఇప్పుడు ఎదురు తిరిగి దేశాన్ని కాపాడటానికే కాంగ్రెస్‌తో కలుస్తున్నానని చెప్తున్నారు. టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రూ. 10 వేల కోట్ల మేర బ్యాంకులకు బురిడీ కొట్టించినా ఏనాడూ రాజీనామా చేయించాలనే ఆలోచన చేయలేదు.

విభజన జరిగిన నాటి నుంచి విభజన హామీలు నెరవేర్చాలని కోరుతున్న ప్రతిపక్ష పార్టీ ఉద్యమాలను అణచివేస్తున్న చంద్రబాబు బీజేపీకి ఠీ కొట్టిన నాటి నుంచి నవ నిర్మాణ దీక్షలకు ధర్మ పోరాట దీక్షలు అని పేరు మార్చి జనాన్ని మోసం చేస్తున్నారంటూ మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ పార్టీకి వ్యతిరేకంగా ఆనాడు ఎన్‌టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించాడో అదే పార్టీతో జట్టు కడుతుంటే జనం చీ కొడుతున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ చంద్రబాబు శిలాఫలకాల సూత్రాన్ని ఆచరణలో పెట్టాడు. పోలవరం గేటు, కడప స్టీల్‌ ప్లాంట్, రాజధానికి శంకుస్థాపన పేరుతో జనాన్ని బుట్టలో పడేయడానికి సిద్ధమయ్యారు. పచ్చమీడియాకూడా చంద్రబాబును జాకీలేసి పైకిలేపే వ్యూహంతో పావులు కదుపుతున్నా సోషల్‌ మీడియా ప్రభావం ముందు ఎల్లో మీడియా కుప్పిగంతులు పనిచేయడం లేదు.

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat