ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకంటే ముందుగా ఆయన ‘రాజశ్యామల యాగం’ చేసి ఎన్నికల ప్రచారంలోకి దూకిన గులాబీ దళపతి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మరో యాగానికి సిద్ధమవుతున్నారని విశ్వసనీయవర్గాల సమాచారం. టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మ్రోగించి రెండోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రాజశ్యామల యాగం జరిపించిన విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్రను కేసీఆర్ దంపతులు కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. ఈ సందర్భంగా మరో యాగం చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మరోసారి యాగం నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 21 నుండి ఎర్రవెల్లిలోని తన వ్యవసాయక్షేత్రంలో యాగాన్ని నిర్వహించబోతున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. అయితే ఏ యాగం చేయబోతున్నారు ? దాని పేరు ఏంటీ ? అనేది తెలియరావడం లేదు. మరి గులాబీ దళపతి యాగం చేస్తారా ? లేదా ? అనే వివరాలకు మరికొంత కాలం వేచి చూడాల్సిందే.