ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కష్టానికి ప్రతిరూపమే శ్వేత పత్రాలు అని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధిని, పోలవరాన్ని ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ కాదంటుందా అని పుల్లారావు ప్రశ్నించారు. గుంటూరులో మీడియాతో ఆయన మాట్లాడారు. రాజధానికి నిధులు ఎందుకివ్వరని జగన్ కేంద్రాన్ని ప్రశ్నించారా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది అని ఆయన అన్నారు. దేశంలో ఎక్కువ పింఛన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీయే అని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, పింఛన్లపై వైసీపీ నేతలు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. పొత్తులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ వాటిపై స్పష్టత రావాలని.. ఇప్పుడేమీ చెప్పలేమన్నారు. పొత్తున్నా, లేకున్నా టీడీపీ గెలుపు ఖాయమని పుల్లారావు ధీమా వ్యక్తం చేశారు.
