Home / Uncategorized / సాగుకు వ్యర్థ జలాల “మేఘా” శుద్ధి

సాగుకు వ్యర్థ జలాల “మేఘా” శుద్ధి

కేసీ వ్యాలీ… వ్యర్థ జలాలను శుద్ధిచేసి బెంగళూరు సరిహద్దున ఉన్న కోలార్‌, చిక్‌బళ్ళాపూర్‌ జిల్లాలోని అంతరించిపోతున్న
భూగర్భజలాలను చెరువులు నింపడం ద్వారా అక్కడి కరువును తరిమికొట్టేందుకు మేఘా ఇంజనీరింగ్‌ చేపట్టిన ఓ
అరుదైన పథకం. దేశంలో ఇలాంటి పథకం ఇంకెక్కడా చేపట్టలేదు. ఈ పథకం ద్వారా బెంగళూరు నగరంలోని వ్యర్థ (డ్రైనేజి)
సమస్యకు పరిష్కారంతో పాటు గ్రామీణ ప్రాంతంలోని చెరువులను నింపడం ద్వారా భూగర్భ జలాలను పెంచడం ఈ పథకం
ప్రధాన ఉద్దేశమని ఎంఈఐఎల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సుధీర్‌ మోహన్‌ తెలిపారు. మనదేశంలో తొలిసారిగా వ్యర్థ జలాలను శుద్ధి చేసి
చెరువులను నింపడం అనే వినూత్నం పథకం ఏంఈఐఎల్‌కే సాధ్యమైంది.

బెంగళూరు నగరం నుంచి వ్యర్థ జలాలను శుభ్రపరిచి కోలార్‌, చిక్కబళ్లపూర్‌ చెరువుల్లో నింపాలని నిర్ణయించింది. ఈ
కార్యక్రమాన్ని రాష్ట్ర చిన్ననీటి పారుదల, భూగర్భజల శాఖ ఆధ్వర్యంలో చేపట్టింది. దేశంలోనే ఇలాంటి పథకాన్ని చేపట్టడం
ఇదే తొలిసారి. మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ అతిస్వల్ప కాలంలోనే ఈ ప్రాజెక్టును అందుబాటులోకి
తీసుకువచ్చింది.

ఈ పథకాన్ని టెండర్లలో దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌ అనేక అవరోధాలు, అవాంతరాలను అధిగమించి
గడువుకన్నా ముందే ఈ పథకాన్ని పూర్తిచేయగలిగింది. అయితే ప్రభుత్వం ఈ పథకం క్రింద మరిన్ని అదనపు పనులను
అప్పగిస్తుండడంతో ఇంకా పనులు జరుగుతున్నప్పటికి తాజాగా అమలులోకి వచ్చింది. బెంగళూరులో శుద్ధి చేసిన నీటిని
ప్రస్తుతం పంపింగ్‌ చేయడం ద్వారా చెరువులకు నీటి సరఫరా ప్రారంభమయ్యింది.
ఈ పథకంలో భాగంగా ఎంఈఐఎల్‌ దశలవారిగా 6 క్లష్టర్లలోని 126కు పైగా చెరువులకు నీరిందించాలనే లక్ష్యంతో ప్రస్తుతం
లక్ష్మిసాగర్‌, ఉద్దపనహళ్లి, నర్సాపుర, దొడవాళ్ళభి, భత్తన్‌కేరే, సింగనహళ్లి తదితర చెరువుల వైపు నీరు ప్రవహించడం
మొదలైంది. ఈ పథకం క్రింద భూగర్భజలాలు అభివృద్ధి చేయడం ద్వారా ఆయకట్టుకు నీరందించాలనేది లక్ష్యం. గత 3, 4
దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. ఫలితంగా బావులు, బోర్లు ఎండిపోయాయి. వాటిని
పునర్జీవింపచేయడం ద్వారా రైతులు తిరిగి పంటలు పండించుకోవడం సాధ్యమవుతుంది. కరువు నుంచి రైతులను కాపాడే
విధంగా శుద్ధిచేసిన బెంగళూరు నగర వ్యర్థ నీరు ఉపయోగపడతాయని ఎంఈఐఎల్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సుధీర్‌ మోహన్‌
తెలిపారు.

ఈ తరహా ప్రాజెక్ట్‌ మొదటిది…

ఈ పథకంలో భాగంగా భూ గురుత్వాకర్షాణకు వ్యతిరేకంగా నీటిని సరఫరా చేయాల్సినందున 6 పంపింగ్‌ స్టేషన్లను
నిర్మించారు. 6 పంపింగ్‌ స్టేషన్లకు గాను 3 పంపింగ్‌ స్టేషన్లు పూర్తిచేసి నీరందిస్తున్నారు. మిగతా పంపింగ్‌ స్టేషన్లలో కూడా
90% పని పూర్తయ్యింది. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.1342 కోట్లు. కేసీ వ్యాలీ ప్రాజెక్టుకు విద్యుత్‌ సమస్యలు
ఈతలెత్తకుండా మేఘా ఇంజనీరింగ్‌ 6 విద్యుత్‌ సబ్‌స్టేషన్లను 66 కేవీ విద్యుత్‌ వినియోగించేలా ఏర్పాటు చేశారు. ప్రాజెక్ట్‌లో
భాగంగా 160 నుంచి 2800 హార్స్‌ పవర్‌ సామర్థ్యం కలిగిన 23 మోటార్లను ఏర్పాటు చేశారు. నీటి సరఫరాకు 124
కిలోమీటర్ల పొడవున పైపులైన్లను బెంగళూరు నగరం నుంచి నిర్మించారు. 2016 నవంబర్‌లో ఈ పని ప్రారంభం కాగా
మొదటి దశ ఇప్పటికే పూర్తి చేసి రెండవ దశ పనులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 126 కు పైగా చెరువుకు దశలవారిగా
నీరందుతుంది.

ఇందుకోసం తాలుకలవారిగా చెరువులను క్లష్టర్లుగా విభజించారు. దేశంలో తొలిసారిగా వ్యర్థ జలాలను శుద్ధి చేసి కరువు
ప్రాంతానికి నీరందించే ఈ పథకాన్ని కర్నాటక రాష్ట్ర చిన్న నీటిపారుదల, భుగర్భశాఖ రూపొందించాయి. బెంగళూరు
నగరంలో కోరమంగళ – చల్లాగట్టా ప్రాంతాల్లో వ్యర్థ జలాలను శుద్ధిచేసే ప్లాంట్లను నిర్మించింది. ఇక్కడ 200 మిలియన్‌ లీటర్ల
రోజుకు శుద్ధి చేయడం ప్రారంభమైంది. అక్కడి నుంచి కోలార్‌, చిక్‌బళ్లాపూర్‌ జిల్లాలోని 126 పైగా చెరువులకు ఈ నీటిని
సరఫరా చేయడం ప్రారంభమైంది. ఈ పథకాన్ని దశలవారిగా రోజుకు 440 మిలియన్‌ లీటర్లు శుద్ధి చేసే విధంగా
పూర్తిస్థాయిలో నిర్మించేందుకు పనులను కొనసాగిస్తోంది.

బెంగళూరు మెట్రోపాలిటన్‌ నగరంలోనే అత్యధిక శాతం పనులు చేపట్టవలసి రావడంతో పనులు నిర్వహించడం సవాల్‌గా
మారింది. రాష్ట్ర, కేంద్ర విభాగాల నుంచి అనేక అనుమతులు సాధించడం, ఎక్కువగా ట్రాఫిక్‌ ఉండే ప్రాంతాల్లో, ఇరుకైన
ప్రాంతాల్లో పనులు చేపట్టడం, ప్రైవేటు భూములు, అకాల వర్షాలు కురవడం లాంటి అనేక ప్రతికూలతలను ఎంఈఐఎల్‌ ఈ
ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఎదుర్కొంది. అవాంతరాలన్నింటినీ విజయవంతంగా అధిగమించిన మేఘా ఇంజనీరింగ్‌
గడువులోగా పనులను పూర్తిచేసింది.

ఈ ప్రాజెక్టు కోసం ప్రత్యేక పైపులు…

ఈ ప్రాజెక్టులో భాగంగా జిల్లాలోని ఆరు తాలుకాల్లోని చెరువులను నింపుతారు. ఇందుకోసం ఆరు అతిపెద్ద పంప్‌హౌజ్‌లను
నిర్మించారు. బెంగళూరులోని ప్రధాన రహదారుల వెంబడి, జాతీయ రహదారుల వెంబడి, రైల్వే ట్రాక్‌ కిందినుంచి 124
కిలోమీటర్ల ఎంఎస్‌ పైప్‌లైన్‌ వేశారు. సాధారణంగా ఇనుప పైపులు కొంతకాలానికి తుప్పు పట్టి, భూమిలో కలిసిపోతాయి,
ఇలాంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకొని మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ ప్రత్యేక పైపులను ఈ ప్రాజెక్టు కోసం

ఉపయోగించింది. తుప్పు సమస్యను నిరోధించేలా, అధిక నీటి ప్రవాహ తీవ్రతను తట్టుకునేలా వీటిని రూపొందించారు.
అంతేకాకుండా పైపుల వెలుపలి భాగంలో ఐరన్‌ మెష్‌తో కప్పబడి ఉంటుంది. పైపుల కొనవద్ద సిమెంట్‌తో ప్లాస్టరింగ్‌ చేశారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat