Home / 18+ / అందుకే తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడా?

అందుకే తెలంగాణ ఫలితాల తర్వాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడా?

తెలంగాణ ఎన్నికల ఫలితాల తరువాత చంద్రబాబు తన నీడను చూసి కూడా భయపడుతున్నాడని ప్రతిపక్ష వైఎస్సాఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు.. తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ విశాఖ, ఒంగోలు సభల్లో తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని అడ్డుకుంటుందన్న చంద్రబాబు ఎన్నికలకు ముందు నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుందామని కేటీఆర్‌ను అడిగారని స్వయంగా ఆపార్టీ కీలక మంత్రి కేటీఆరే వ్యాఖ్యానించారు. చంద్రబాబు టీడీపీ, టీఆర్‌ఎస్‌ పార్టీలు కలిసి పోటీ చేయడం ప్రత్యేక హోదాకు వ్యతిరేకం కాదు కానీ వైసీపీ టీఆర్ఎస్ లు స్నేహపూర్వకంగా మెలిగితే దీనిని మాత్రం చంద్రబాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం విమర్శిస్తున్నారు. మొదటినుంచీ వైయస్‌ఆర్‌ సీపీ దృష్టి, ఆలోచనా విధానాలన్నీ ఆంధ్రరాష్ట్ర అభివృద్ధి కోసమే ఉపయోగిస్తున్నా.. హోదా విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పినా తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం మొదట హోదా వద్దని, ఇప్పుడు కావాలని మాయమాటలు మాట్లాడారు.

గతంలో వైసీపీ బీజేపీతో, జనసేనతో వైయస్‌ఆర్‌సీపీ కలిసిపోయిందని మాట్లాడిన తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు టీఆర్‌ఎస్‌తో కలిసిపోయాయని ప్రచారం చేసి ప్రాంతీయ బేధాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. గత తెలంగాణ ఎన్నికల్లో కూడా లగడపాటి రాజగోపాల్‌ చంద్రబాబుతో చేతులు కలిపి ఆంధ్రరాష్ట్ర ప్రజలను మోసం చేశాడనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా వైసీపీ నేత బొత్స మాట్లాడుతూ మనిషి బలహీనతలతో ఆడుకోవడం లగడపాటికి అలవాటన్నారు. లోకేష్‌తో కలిసి బెట్టింగ్‌ల డబ్బు కోసం తప్పుడు సర్వే చేసి ఉంటాడన్నారు.. అయితే బొత్స ఈ విధంగా మాట్లాడటానికి కారణాలు చాలా ఉన్నాయి. తెలుగుదేశం తెలంగాణలో పోటీ చేసినా సెటిలర్లు టీడీపీ ఓటమిని కోరుకున్నారు. ఏపీని నాశనం చేసిన పార్టీ కాబట్టి టీడీపీ ఓడిపోవాలని కోరుకున్నారు.

అయితే డ్యామేజ్ కంట్రోల్ కోసం ఫేక్ సర్వే వదిలితే గాలి బావుండి గెలిచేయొచ్చనేది చంద్రబాబు ఆలోచన.. లగడపాటి రాజగోపాల్‌ను చరిత్ర క్షమించదని, స్వార్థ ప్రయోజనాల కోసం సర్వేల పేరుతో ప్రజలను మోసం చేయొద్దన్నారు. మరోవైపు మజ్లిస్‌ పార్టీ కూడా టీడీపీ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. చంద్రబాబు దుష్ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ కూడా ఏపీలో ప్రచారం చేస్తామన్నారు. దేశంలో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలవడానికి తెలుగుదేశం కృషి ఉందని చంద్రబాబు మాట్లాడడంతో రాష్ట్రమంతా బిత్తరపోయింది. చంద్రబాబు ఆ రాష్ట్రాలకు వెళ్లి మాతృభాష హిందీలో మాట్లాడి ప్రభావితం చేశాడు కానీ.. తెలంగాణలో మన మాతృభాష తెలుగులో మాట్లాడి పార్టీని గెలిపించలేదని పలువురు ఎద్దేవా చేశారు. బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసి ఇప్పుడు కాంగ్రెస్ ను కాపురానికి పిలవడంతో వీరిద్దరి అనైతిక పొత్తును ప్రజలు చీదరించుకుంటున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat