అధికారం ఉంది కదా ఏం చేసిన మనల్ని అడిగేవాడు లేదు అన్నట్టు ప్రవతిస్తున్నారు మన ఆంధ్రా టీడీపీ నాయకలు.ఇంతకు అసలు విషయానికి వస్తే అధికార పార్టీ ఎమ్మెల్యే ఈరన్న విషయంలో సుప్రీంకోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇచ్చింది.ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం జరిగింది.ఈ విషయం పై శనివారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు టీడీపీకి చెంపపెట్టు లాంటిదని వ్యాఖ్యానించారు.నేర చరితుడైన నేతను టీడీపీ ఇన్నాళ్లు కాపాడిందనీ, అలాంటి వారిని ఎమ్మెల్యే చేసి అసెంబ్లీ ని మలినం చేసారని మండిపడ్డారు. కోర్టు తీర్పు ప్రతిని అసెంబ్లీ కార్యదర్శికి అందించామని తెలిపారు. తిప్పేస్వామిని ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించాలని స్పీకర్‌కి కోర్టు స్పష్టంగా చెప్పినా.. ఇప్పటివరకు ఎలాంటి విషయం తేల్చకుండా నాన్చుతూ సమయాన్ని వృధా చేస్తున్నారని చెప్పారు.
కోర్టు తీర్పుని గౌరవించాల్సిన బాధ్యత స్పీకర్‌కి, ముఖ‍్యమంత్రికి లేదా అని ప్రశ్నించారు.నేర చరిత్ర కలిగిన ఈరన్నను కాపాడాలనుకుంటున్నారంటూ మండిపడ్డారు..లేకుంటే కోర్టు తీర్పు అమలు అయిన 24 గంటల్లోగా చేయాల్సిన పనిని ఎందుకు సాగాదీసుకోచ్చారని ప్రశ్నించారు. కోర్టు 27వ తేదీన ఈరన్న ఎమ్మెల్యే కాదని తీర్పు ఇస్తే.. ఆయన నిన్న (శుక్రవారం) రాజీనామా చేయటం ఏంటని ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఈరన్న రాజీనామా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చెయ్యటంగా సురేష్ అభివర్ణించారు.