వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి మరోసారి తన రాజకీయ హుందాతనాన్ని చాటుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో పలువురు జగన్ దృష్టికి తమ సమస్యను తీసుకువచ్చారు. బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్ కోస్టు గార్డు చెర లో చిక్కుకున్నారని, వారిని విడిపించాలని జగన్ ను కోరారు. 28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారాన్ని జగన్ కు వివరించారు. ఆ కుటుంబ సభ్యుల వద్ద వివరాలు తెలుసుకున్న జగన్ భయాందోళన చెందవద్దనన్నారు. నిద్రాహారాలు మాని తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని వారిని విడిపించాలని వారంతా జగన్ ను కోరారు.
ఈ క్రమంలో జగన్ వారి సమస్య విని చలించిపోయారు. ఏదో వినతిపత్రం తీసుకుని విదిలేయలేదు.. వెంటనే వారి ఊరిని దాటుతుండగానే అందుబాటులో ఉన్న పార్టీ నేతలో కలిసి సమస్యపై చర్చించారు. అంతే వేగంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు ఈ సమాచారాన్ని వివరించారు. వీలైనంత త్వరగా వారిని విడిపించాలని పార్టీ ఎంపీలను ఆదేశించారు. దీంతో హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు కలిసి కోరారు. బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కేంద్ర మంత్రిని కలిశారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ తీర ప్రాంత భద్రతా దళం చేతిలో బందీగా మారారని కోరారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది, విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు చేపల వ్యాపారం చేసే ఓ కాంట్రాక్టర్ దగ్గర గుజరాత్‌లో పని చేస్తున్నారు.
ఈ సమాచారమంతా సుష్మాస్వరాజ్ కు వివరించగా.. ఆమె విచారణ చేపట్టాలని ఆదేశించారు. వీరంతా పొరబాటున పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి వెళ్లిపోగా.. వారిని పాకిస్తాన్ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారని, వీరంతా ప్రస్తుతం కరాచీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో వారిని విడిపించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని సుష్మా ఆదేశించగా త్వరలేనే 28 విడుదలకు మార్గం సుగమం కానుంది. ప్రతిపక్ష నేతగా జగన్ ఏం చేసారనేవారికి ఇది ఒక చెంపపెట్టు.. జగన్ వద్దకు సమస్య వస్తే వారు ఎవరు అని కూడా ఆలోచించకుండా తక్షణకే స్పందించిన తీరు చూసి బాధితుల కుటుంబాలు హర్షం వ్యక్తపరుస్తున్నాయి.