తెలంగాణ ఎన్నికలు నిజంగా టీడీపీ పార్టీని ఘోరంగా దెబ్బ తీశాయి. కూకట్ పల్లి నియోజకవర్గంలో చంద్రబాబు, నందమూరి ఫ్యామీలీ ఎంత హాడావీడి చేసిన దారుణంగా ఓడిపోయారు. తెలంగాణాలో ఉన్న సీమాంధ్ర ఓటర్లందరూ కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఓట్లు వేసిన విషయం ఇప్పుడు తెలుగుదేశం నేతలను భయపెడుతోంది. నందమూరి కుటుంబం నుంచి అభ్యర్థిని నిలబెట్టినప్పటికీ టీడీపీకి ఓట్లేయడానికి సీమాంధ్ర ఓటర్లు ఇష్టపడలేదు. ఎందుకంటే ఏపీలో చంద్రబాబుపై ఉన్న తీవ్రమైన వ్యతీరేకతతోనే అంటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఆ ఎన్నికల ప్రభావం ఖచ్చితంగా ఆంధ్ర లో ఉంటుందని అందరూ అంచనా వేస్తున్నారు . 2019 ఎన్నికల్లో దాదాపు అత్యధిక సీట్లు వైసీపీ పార్టీ గెలవడం ఖాయం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో అసంతృప్త నాయకులందరూ వైసీపీలో బెర్త్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందరికంటే ముందుగా టీడీపీ మంత్రి పితాని సత్యనారాయణ తెలంగాణా ఫలితాలు వచ్చిన వెంటనే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి టచ్‌లోకి వెళ్ళారని తెలుస్తోంది. వైఎస్ జగన్‌కి ఒకే అయితే జిల్లా అంతా కూడా వైసీపీ గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తానని విజయసాయితో చెప్పాడట పితాని. పితాని చెప్పిన విషయాలన్నింటినీ విజయసాయిరెడ్డి వైసీపీ ముఖ్యులతో చర్చించారని తెలుస్తోంది. జగన్ ఒకే చెప్తే మాత్రం స్వయంగా ఒక మంత్రి స్థాయి నాయకుడు చంద్రబాబు నాయకత్వంపై నమ్మకం లేదంటూ వైసీపీలో చేరితే అది అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి చాలా పెద్ద దెబ్బ అవుతుందనడంలో సందేహం లేదు.