ఏపీలో అధికార టీడీపీకి ఘోర పరాజయం తప్పదంటున్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. చంద్రబాబుపై వ్యతిరేకత ఉందని, 2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తాను ఏపీలో అడుగుడు పెడతానని, జగన్కు మద్దతుగా ప్రచారం కూడా చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలు, తాజా రాజకీయాలపై మాట్లాడిన అసద్.. దేశంలో బీజేపీ, కాంగ్రెసేతర వేదిక ఏర్పడాల్సిన అవసరం ఉందన్నారు అసదుద్దీన్. ఆ వేదికకు ఏ పేరు పెట్టినా అభ్యంతరం లేదన్నారు. ఈ విషయంలో కేసీఆర్ సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకున్నారని, ఆయనకు అండగా ఉంటామని చెప్పారు. తెలంగాణలో బాబు ప్రచారం మాత్రమే కాదు.. కోట్లాది రూపాయలు ఖర్చు చేశారన్నారు.
2019 ఎన్నికల్లో ఆ పార్టీకి కనీసం రెండు ఎంపీ సీట్లు కూడా గెలవలేదని చెప్పారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకు మంచి మిత్రుడన్నారు అసదుద్దీన్. తాను కచ్చితంగా ఆంధ్రాకు వెళ్లి తీరుతానని, జగన్కు మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. చంద్రబాబుకు ప్రజా వ్యతిరేకత అంటే ఏంటో చూపిస్తాన్నారు. ఏపీలో మైనారిటీలు, దళితులు, బీసీలతో పాటు ఇతర వర్గాల అభ్యున్నతి కోసం ఏపీలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. తనకు మద్దతిస్తానని అసదుద్దీన్ ప్రటకటించంపై జగన్ ఎలా స్పందిస్తారోనని ఆయన అభిమానులంతా వేచిచూస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీలో 2019లో రానున్న అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణ ఎన్నికల కంటే ఎంతో వేడీగా జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ ఎన్నికల్లో తాము కూడా వేలు పెడతామనీ కేసీఆర్, కేటీఆర్ కూడా ప్రకటించటంతో ఏపీ ఎన్నికలు ఊహించినదానికంటే వేడిగా జరుగుతాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇలా అసదుద్దీన్ ప్రకటన వెలువడగానే వైసీపీ అభిమానులు, జగన్ ఫ్యాన్స్ అందరూ హైదరాబాద్ లోని అసదుద్దీన్ నివాసానికి చేరుకుని ఆయనకు అభినందనలు తెలిపారు. త్వరలో తమ నాయకుడు జగన్ మోహన్ రెడ్డిని కలవాలని కోరారు. అందుకు అసదుద్దీన్ కూడా సుముఖత వ్యక్తం చేసారు