తెలంగాణలో జరిగిన ఘోర పరాజయం విషయంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సాకు దొరికింది. తెలంగాణ రాష్ట్రంలో మహాకూటమి ఘోర పరాజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు…ఈ సందర్భంగా ఆయన పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఎక్కడో ఏదో జరిగింది…అంతా ఈవీఎంలే చేశాయి…ఈవీఎంలు ట్యాపరింగ్‌కు గురయ్యాయి..వెంటనే వీవీ ప్యాట్ ఓట్లను లెక్కించాలి..దురదృష్టవశాత్తు కేసీఆర్‌తో..ఈసీ కుమ్మక్కైయ్యింది’ అంటూ వాపోయారు.
తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ మిషన్లు పూర్తిగా టాంపరింగ్ అయ్యాయని..తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోయి ఉంటుందని..తాము ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగిందని ఉత్తమ్ అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో లెక్కింపు చేపట్టాలని డిమాండ్ చేసినట్లు…లెక్కింపు చేపట్టే అనేక బూత్‌లలో ఓటర్ల సరళి..పడే ఓట్లు ఒక విధంగా…వీవీ ప్యాట్ లెక్కింపులు వేరే విధంగా ఉన్నాయన్నారు. ఈసీ అధికారి రజత్ కుమార్‌ను కాంగ్రెస్ సీనియర్ నేతలు కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. ధర్మపురిలో ఓ నియోజకవర్గంలో తమ అభ్యర్థి 440 ఓట్లతో పరాజయం చెందారని తెలిపారు. కేసీఆర్ ప్రకటించిన షెడ్యూల్..అనంతరం ఈసీ షెడ్యూల్ ప్రకటించిందని దీనిపై సందేహాలు ఉన్నాయన్నారు.అయితే దీనిపై పలువురు గట్టిగా సమాధానం ఇచ్చారు…ఈరోజు జరిగిన అన్ని రాష్ట్రాలలోను ఇదే విధంగా జరిగిందని అక్కడ కాంగ్రెస్ గెలిచింది..మరి కాంగ్రెస్ కూడా ఈసీతో కుమ్మక్కయ్యిందా అని మండిపడ్డారు.