తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది కీలక నేతలు ఓడిపోయారు. మహామహులు అనుకున్న నేతలు కూడా మట్టికరిచారు. టీఆర్ఎస్ దాదాపు 88 సీట్లలో, మహాకూటమి 21 స్థానాల్లో, మజ్లిస్ ఆరు స్థానాల్లో, బీజేపీ రెండు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది. అయితే కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు. రేవంత్‌పై టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి 10 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. రేవంత్ కంచుకోటలో కచ్చితంగా గులాబీ జెండా ఎగురేస్తామని మొదట్నుంచి టీఆర్ఎస్ నేతలు చెబుతూ వచ్చారు. అన్నమాటే అక్షరాలా నిజమైందని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. మరోవైపు.. తనను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని కూడా రేవంత్ సవాల్ చేసిన సంగతి తెలిసిందే. కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ప్రచారం చేయడంతో సీన్ రివర్స్ అయ్యిందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
Tags 2018 elections telangana trs win