తెలంగాణలో ప్రతిపక్ష కాంగ్రెస్ రాజకీయాలు చూస్తుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు..అధికార టీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడంలో భాగంగా చిన్న చిన్న విషయాలపై కూడా రచ్చ చేస్తూ, పనికిమాలిన విమర్శలు చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయి..ఇటీవల బతుకమ్మ చీరలను కాల్చివేయడం కాంగ్రెస్‌కే మైనస్‌గా మారింది. ఇలా ప్రతిదానికి చిల్లర రాజకీయం చేస్తూ ప్రజల్లో పలుచన అవుతున్నామని కూడా టీ కాంగ్రెస్ నాయకులు గ్రహించడం లేదు..ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర మంత్రులకు, కార్యదర్శులకు పంపిస్తున్న దీపావళి కానుకలపై కూడా అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తుంది. దీపావళి పండుగ సందర్భంగా ఒకరికొకరు స్వీటు బాక్స్‌లు, పట్టుబట్టలను, ఇతర వస్తువులను కానుకలుగా పంచుకోవడం ఆనవాయితీ. ఇదే ఆనవాయితీని తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుంది. దీపావళి పండుగను పురస్కరించుకుని కేంద్ర మంత్రులకు, కార్యదర్శులకు పెద్ద ఎత్తున కానుకలు పంపిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగ్ చొప్పున పంపిస్తోంది. అందులో ఆడవారు అయితే దాదాపు రూ. 30 వేలఖరీదైన చేనేత లేదా పట్టుచీరతో పాటు వెండి కుందులు, కళాకృతులు పంపిస్తున్నారు.ఇక మగవారికి అయితే చేనేత ధోతీ లేదా, కుర్తా, పైజామాలతో పాటు ఇతర ఆర్టికల్స్‌తో కూడిన గిఫ్ట్ బ్యాగ్స్ ప్రభుత్వం పంపిస్తుంది. చేనేతకు జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించడంతో పాటు, మర్యాదపూర్వకంగా ఉంటుందనిచేనేత జౌళిశాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో దీపావళి కానుకలు కేంద్ర పెద్దలకు పంపిస్తున్నారు. ఇలా పండుగలకు కానుకలు ఇచ్చిపుచ్చుకోవడం వల్ల కేంద్ర, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, స్నేహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. అయితే టీ కాంగ్రెస్ నాయకులు మాత్రం దీపావళి కానుకలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు కేంద్రమంత్రులకు ఇస్తున్న లంచాలుగా ప్రొజెక్ట్ చేస్తోంది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి మరీ దీపావళి కానుకలపై తీవ్ర విమర్శలు చేశాడు.. ఇలా కేంద్ర మంత్రులు, కార్యదర్శులకు మంత్రి కేటీఆర్ వస్ర్తాలు పంపడం లంచం కిందికే వస్తుందని, మామూలుగా కాంట్రాక్టర్లు పనులు చేయించుకుని తమకు సహకరించిన అధికారులకు, రాజకీయ ప్రముఖులకు ఇలాగే బహుమతులు ఇస్తారని , ఇప్పుడు కేంద్ర పెద్దల దగ్గర పనులు చేయించుకుని లంచంగా బహుమతులు పంపిస్తున్నారని టీఆర్ఎస్ సర్కార్‌కు చురకలు అంటించారు. లంచం ఇచ్చినా తీసుకున్నా చెప్పుతో కొట్టమని సీఎం కేసీఆర్ చెబుతున్నారని, ఇలా బహుమతుల రూపంలో లంచం ఇచ్చేవారిని ఏం చేయాలని మల్లు భట్టి విక్రమార్క ప్రశ్నించారు. అయినా బహుమతులు ఇచ్చుకుంటే మీరు వ్యక్తిగతంగా ఇచ్చుకోండి..ఇలా రాష్ట్ర ఖజానా నుంచి బహుమతులు ఎలా ఇస్తారని భట్టివిక్రమార్క విమర్శించారు. అయితే కాంట్రాక్టర్ల దగ్గర భారీగా కమీషన్లు బహుమతులు నొక్కేసిన ఘనత టీ కాంగ్రెస్ నాయకులదే అని..అందరూ మీలాగే ఉంటారనుకోవడం మీ భ్రమ అని పండుగ సందర్భంగా కానుకలపై కూడా ఇలా చిల్లర రాజకీయం చేయడం టీ కాంగ్రెస్ కే చెల్లిందని టీఆర్ఎస్ శ్రేణులు భట్టికి గట్టిగా కౌంటర్ ఇస్తున్నాయి.