తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సెల్ఫ్‌గోల్ చేసుకున్నారు. తనతో పాటుగా తన పార్టీ అయిన కాంగ్రెస్ సైతం నవ్వుల పాలయ్యేలా ఆయన వ్యవహరించారు. టీఆర్ఎస్ పార్టీ నాయకురాలు, ఎంపీ కవిత ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్‌తో ఆయన డిఫెన్స్‌లో పడిపోయారు.ఇంతకీ ఏం జరిగిందంటే…పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి సహా పలువురు నేతలు దుబాయ్ వెళ్లి గల్ఫ్ కార్మికులను పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా వారు తెలంగాణ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు.
కాగా కాంగ్రెస్ నేతల గల్ఫ్ యాత్రపై టీఆర్ఎస్ ఎంపీ కవిత స్పందిస్తూ…తెలంగాణ బిడ్డలు గల్ఫ్‌కు వలసలు వెళ్లడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. నిజామబాద్‌లో మీడియాత మాట్లాడిన ఆమె కాంగ్రెస్ హయంలో 2006 నుంచి 2011వరకు నయా పైసా లేకుండా ఎన్నారై సెల్ నడిపిందని మండిపడ్డారు. 2012 నుంచి 2014 వరకు గల్ఫ్ సంక్షేమం కోసం ఇచ్చింది కేవలం రూ. 6 కోట్లు మాత్రమే నని… అదే టీఆర్ఎస్ హయంలో 2014 నుంచి 2018 వరకు రూ. 106 కోట్లు కేటాయించామని… ఈ నాలుగేళ్లలో 1,278 మంది గల్ఫ్ లో చనిపోయిన తెలంగాణ బిడ్డలను ఒక్క పైస ఖర్చు లేకుండా స్వదేశానికి తీసుకువచ్చామన్న కవిత…
అదే కాంగ్రెస్ 10 ఏళ్ల పాలనలో గల్ఫ్ లో చనిపోయిన వారిని తీసుకువచ్చింది వేళ్లమీద లెక్క పెట్టవచ్చు అని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ హయంలోనూ గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలను కూడా టీఆర్ఎస్ పార్టీ చొరవ చూపించి వారిని ఆదుకునే ప్రయత్నం చేసిందన్నారు. ఎవరు మీకు అండగా నిలిచారో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని… ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పే కాంగ్రెస్ వాళ్ళ మాటలు నమ్మొద్దని గల్ఫ్ లో ఉన్న తెలంగాణ బిడ్డలకు కవిత విజప్తి చేశారు .