ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ఇసుక వేస్తే రాలనంత జనం. ఎంతో మంది తమ కష్టాలు చెప్పుకునేందుకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రత్యర్థుల గుండెలదురుతున్నాయి… జగన్ కు అడుగడుగునా వస్తున్న ప్రజా స్పందన చూసి. అధికార పార్టీ నేతల కుతంత్రాలు అడుగడుగునా చిత్తవుతున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలు తెలియజేస్తున్న వాస్తవాలు చూసి టీడీపీ నేతల్లో వణుకు మొదలైంది అంటున్నారు వైసీపీ నేతలు.ఇకపోతే ప్రస్తుత విజయనగరం జిల్లాలో కీలకమైన రాజ వంశాలల్లో బొబ్బిలి ఒకటి. ఆ పేరు చెబితే చాలు పౌరుషానికి మారు పేరుగా భావిస్తారు. బొబ్బిలి గడ్డ అంటేనే పోరుకు పెట్టింది పేరు. ఆలంటి ఇలాకాలో ఇపుడు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర ప్రవేశించింది. బొబ్బిలి లో జగన్ ఎలా గర్జిస్తాడన్నది ఇపుడు జిల్లా రాజకీయాల్లో ఆసక్తికరమైన అంశంగా మారింది.బొబ్బిలి సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రిగా ఉన్న సుజయ క్రిష్ణ రంగారావుకు జగన్ సవాల్ చేయనున్నారా. నిన్నటి వరకు వైసీపీలో ఉండి మంత్రి పదవి కోసం పార్టీని ఫిరాయించిన రాజు గారికి అదే కోట వద్ద జవాబు చెప్పనున్నారా అంటే అవుననే అంటున్నారు.
సరిగ్గా రెండేళ్ళ క్రితం సుజయ క్రిష్ణ రంగారావు వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు. పరిహారంగా మంత్రి పదవిని కూడా పొందారు. అయితే జనం మనసులు మాత్రం ఆయన ఎప్పటికీ గెలుచుకోలేరని వైసీపీ నేతలు అంటున్నారు.ఎప్పుడు ఎన్నికలు జరిగినా బొబ్బిలి వైసీపీదేనని గట్టిగా చెబుతున్నారు. ఇక్కడ జనం మొదటి నుంచి కాంగ్రెస్ ని ఆదరిస్తూ వస్తున్నారు. అలాగే వైసీపీకి కూడా పెద్ద పీట వేశారు. అనేక ఎన్నికల్లో సైకిల్ పార్టీ ఇక్కడ పరాజయం పాలైంది. టీడీపీ ఆవిర్భావం తరువాత కేవలం రెండు సార్లు మాత్రమె ఆ పార్టీ నెగ్గిందని అంటే ఎంత వీక్ గా ఉందో అర్ధం చేసుకోవచ్చు.బొబ్బిలి రాజులంటే పౌరాషానికి ప్రతీకలని, మాట ఇస్తే వెనక్కు తగ్గరని పేరు. అటువంటిది ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో మారడాన్ని ఇక్కడ జనం తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. రేపటి ఎన్నికల్లో సరైన అభ్యర్ధిని వైసీపీ పెడితే మాత్రం సుజయకు పరాభవం తప్పదని కూడా అంటున్నారు. అయితే వైఎస్ జగన్ బొబ్బిలి గడ్డపై ఏం చెబుతారో అన్న ఉత్కంఠ అంతటా ఉంది. జగన్ ఇంతవరకు బొబ్బిలి రాజులపై డైరెక్ట్ అటాక్ చేయలేదు. ఈసారి పాదయాత్రలో మాత్రం మాటల తూటాలు పేలుతాయని, బొబ్బిలి రాజులపై సెటైర్లు కూడా ఉంటాయని అంటున్నారు.