ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, నెల్లూరు జిల్లాకు చెందిన రోహిత్ కుమార్ రెడ్డి అనే యువకుడు టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితుడై, పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ గత 17 రోజులుగా విజయవాడ నుండి పాదయాత్ర చేస్తూ హైదరాబాద్ చేరుకున్నాడు.ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ గారిని కలవడం జరిగిందితెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు తనకు తెలంగాణ రాష్ట్రం పట్ల ఆసక్తిని, అభిమానాన్ని పెంపొందించేలా దోహదపడ్డాయని రోహిత్ కుమార్ రెడ్డి పేర్కొనడం జరిగింది,
అదే క్రమంలో కేటీఆర్ వంటి నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక గొప్ప వరం అని, తాను ప్రసంగించే తీరు, ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల్లో అభిమానం పొందుతూ, ప్రజా సమస్యల పట్ల అవగాహనతో, వాటి పరిష్కారానికి కృషిచేస్తూ దూసుకెళుతున్న విధానం తనని కేటీఆర్ గారికి అభిమానిగా మార్చాయని ఆయన తెలిపారు.యువతరానికి స్ఫూర్తినిచ్చేలా కేటీఆర్ గారు ముందుకు సాగుతున్నారని అందుకే కేటీఆర్ పట్ల తనకున్న ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవడానికి.. ఆయన ముఖచిత్రాన్ని తన గుండెల మీద టాటూగా వేయించుకున్నానని తెలిపారు. తనది పక్క రాష్ట్రం కాబట్టి ఇక్కడ తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధిని, తేడాను గమనించగలిగానని మంత్రిగారితో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణాలో అభివృద్ధి బాగుంది, ముఖ్యంగా రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు అద్భుతం అని రోహిత్ తెలిపారు.
సుదూర ప్రాంతం నుండి గుండెల నిండా అభిమానం నింపుకుని వచ్చిన రోహిత్ ను మంత్రి కేటీఆర్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని కుశల ప్రశ్నలు అడిగారు. ఎన్నికల్లో ప్రచారం చేసే అవకాశం కల్పించాలని రోహిత్ చేసిన విజ్ఞప్తికి మంత్రి సానుకూలంగా స్పందించారు.రోహిత్ కుమార్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా TRSV రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డిలు రోహిత్ కుమార్ రెడ్డి ని మంత్రి కేటీఆర్ గారి దగ్గరకు తోడ్కొని వచ్చారు.