వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత 2019 అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ తరపున తొలి అభ్యర్థిని ప్రకటించారు.విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ సోమవారం సాయంత్రం విజయనగరం జిల్లా కేంద్రంలో జరిగిన బహిరంగసభలో ప్రకటించారు.దీంతో కోలగట్ల వర్గీయుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది.విజయనగరం అసెంబ్లీ స్థానం నుండి 2004లో స్వతంత్ర అభ్యర్ధిగా విజయం సాధించిన కోలగట్ల వీరభద్రస్వామి ఆ తర్వాత పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు.
ఈ మేరకు కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ….
జిల్లాలో తెలుగుదేశం పార్టీ నీచ రాజకీయాలకు పాల్పడుతోంది. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా విజయనగరం జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్పయాత్రకు అడ్డంకులు సృష్టించేందుకు చూస్తోంది. అందులో భాగంగానే విజయనగరం నియోజకవర్గంలో జరిగిన ప్రజాసంకల్ప యాత్రలో ఫ్లెక్సీలు తొలగించడం, విద్యు త్ సరఫరా నిలిపివేయడం వంటి పనులకు టీడీపీ నాయకులు పాల్పడ్డారు. తెలుగుదేశం నాయకులు ఫ్లెక్సీలు తొలగించగలరు గాని ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉన్న జగన్మోహన్రెడ్డిని తప్పించలేరు కదా. 2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని, ఈ సారిమాత్రం ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెబుతారు. ఎక్కడ చూసినా కావాలి జగన్…రావాలి జగన్ అంటున్నారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరుతాయన్న నమ్మకం ప్రజల్లో ఉందని ఆయన చెప్పారు.